Elon Musk Biggest Charity: ఎలాన్ మస్క్ టెస్లా అధినేతగా ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితం. ఎప్పుడు ఏదో విషయంలో ఆయన వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక విషయంలో ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. ఎలాన్ మస్క్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అందరితో ప్రశంసలు పొందుతున్నారు.
చిన్నారుల ఆకలిని తీర్చేందుకు ఎలాన్ మస్క్ ముందుకొచ్చారు. ఐక్య రాజ్య సమితి ఇటీవల ఇచ్చిన పిలుపుతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన 5.7 బిలియన్ డాలర్లు విలువైన టెస్లా షేర్స్‌ను విరాళంగా ఇచ్చారు ఎలాన్ మస్క్. ఈ షేర్స్ ఇండియన్ కరెన్సీ ప్రకారం.. 43 వేల కోట్ల రూపాయల విలువ ఉంటాయని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ చరిత్రలో నిలవనున్నారు. ఆయన ఇచ్చిన విరాళం.. అతి పెద్ద విరాళంగా నిలవనుంది. అయితే ఎలాన్ మస్క్ ఇచ్చినటువంటి విరాళం ఏ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చారనే విషయం ఇంకా తెలియదు.
ఇక ఎలన్ మస్క్‌లాంటి బిలియనీర్స్ అనుకుంటే ప్రపంచంలో కోట్లాది మంది నిరు పేదల ఆకలిని సమస్యను తీర్చొచ్చు అంటూ ఐరాస ప్రపంచ ఆహార ప్రోగ్రామ్ డైరెక్టర్ బేస్లే పేర్కొన్న విధంగానే... ఎలన్ మస్క్ చేసి చూపించారు. ఎలన్ మస్క్ ఇచ్చినటువంటి విరాళంతో దాదాపు నాలుగు కోట్ల మంది ఆకలిని తీర్చొచ్చని అంచనా.
ఐరాస ఆహార ఏజెన్సీ చేసిన ట్వీట్‌పై కూడా ఎలన్ మస్క్ గతంలో స్పందించారు. పేదల ఆకలి సమస్య తీర్చేందుకు మీ ప్రణాళిక ఏమిటి.. ఫండ్స్‌ను ఎలా ఖర్చు చేస్తారో చెప్తే తాను ఇప్పటికిప్పుడే తన షేర్లను విక్రయించి విరాళంగా ఇస్తానన్నారు. అలా తాను గతంలో ఇచ్చిన మాట మేరకు.. ఎలన్ మస్క్ ఇప్పుడు చేసి చూపించాడు. దీంతో ఎలన్ మస్క్‌పై సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెడుతున్నారు నెటిజన్స్. ఎలన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: IND vs WI: విరాట్ కోహ్లీని అలా వదిలేయండి.. రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read: Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి