EPF Passbook: పీఎఫ్ పాస్‌బుక్ అప్‌డేట్ కాకపోతే బ్యాలెన్స్ కట్ అవుతుందా..? క్లారిటీ ఇదే..

EPF Passbook Update: పీఎఫ్‌ పాస్‌బుక్ కట్ అవ్వకపోతే మీ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుందని ఎవరైనా చెబుతున్నారా..? ఎంత కట్ అవుతోందనని అయోమయం చెందుతున్నారా..? ఈ విషయంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పారంటే..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2023, 11:43 PM IST
EPF Passbook: పీఎఫ్ పాస్‌బుక్ అప్‌డేట్ కాకపోతే బ్యాలెన్స్ కట్ అవుతుందా..? క్లారిటీ ఇదే..

EPF Passbook Update: ప్రతి నెల ఉద్యోగస్తుల జీతం నుంచి కొంత అమౌంట్‌ను కట్ చేసి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) ఖాతాలో జమ చేస్తారు. ఇందులో ఒక భాగం యజమాని ద్వారా.. మరో భాగం ఉద్యోగి ద్వారా ఇస్తారు. ఉద్యోగికి వాటాకు సంబంధించి ప్రతి నెల కచితంగా కట్ అవుతుండగా.. కొన్నిసార్లు యజమాని ద్వారా పీఎఫ్‌లో మొత్తాన్ని జమ చేయడంలో జాప్యం జరుగుతోంది.  దీంతో పీఎఫ్ పాస్‌బుక్ అప్‌డేట్‌ అవ్వదు. పీఎఫ్ పాస్ బుక్ అప్ డేట్ కాకపోతే పీఎఫ్ డబ్బులు తగ్గుతాయా అనే అయోమయం చాలా మందిలో నెలకొంది. 

మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా పాస్‌బుక్ అప్‌డేట్ కాకపోతే మీ అకౌంట్‌లో ఎలాంటి నగదు కట్ అవ్వదు. ఈపీఎఫ్‌ మెంబర్ పాస్‌బుక్ అప్‌డేట్ అనేది కేవలం ఎంట్రీ ప్రాసెస్ మాత్రమే. పాస్‌బుక్‌లో వడ్డీ నమోదు చేసిన తరువాత ఖాతాదారునికి ఎటువంటి ఆర్థికపరమైన చిక్కులను ఉండవు. పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయకపోయినా.. ఈపీఎఫ్‌ సభ్యులకు ఎటువంటి ఆర్థిక నష్టం జరగదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 
 
ఈపీఎఫ్‌ నెలవారీ బ్యాలెన్స్ ఎల్లప్పుడూ ఆ ఏడాది ముగింపు బ్యాలెన్స్‌కు యాడ్ అవుతుంది. పాస్‌బుక్‌లో నమోదు చేసిన తేదీ ఈపీఎఫ్‌ వడ్డీ క్రెడిట్‌పై ప్రభావం చూపదు. "సభ్యుని పాస్‌బుక్‌ను వడ్డీతో అప్‌డేట్ చేయడం అనేది కేవలం ఎంట్రీ ప్రక్రియ మాత్రమే. సభ్యుని పాస్‌బుక్‌లో వడ్డీ నమోదు చేసిన తేదీ ఎలాంటి ఆర్థిక ప్రభావాన్ని చూపదు. ఎందుకంటే సంవత్సరానికి సంపాదించిన వడ్డీ ఎల్లప్పుడూ తుది బ్యాలెన్స్‌కు జమ అవుతుంది" అని మంత్రి చెప్పారు. అందువల్ల సభ్యునికి ఎటువంటి ఆర్థిక నష్టం లేదన్నారు.

ఖాతాదారులకు ఈపీఎఫ్‌ వడ్డీ క్రెడిట్‌లో జాప్యం ఎందుకు..? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 6 వరకు 98 శాతం సహకార సంస్థల సభ్యుల ఖాతాలలో వడ్డీ జమ చేసినట్లు వెల్లడించారు. ఈపీఎఫ్‌ వడ్డీ క్రెడిట్ అనేది నిరంతర ప్రక్రియ అని.. ఇది సాధారణ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు ఆటంకం కలగకుండా నిర్దేశించిన పద్ధతిలో జరుగుతుందని మంత్రి రామేశ్వర్ తేలి స్పష్టం చేశారు.

Also Read: IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.10 వేలతో ఈ ఐదు ఆలయాలను సందర్శించండి

Also Read: Rishabh Pant: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. పంత్ లేటెస్ట్ వీడియో చూశారా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News