Free Doorstep Sim Delivery Vodafone Idea allow you to choose VIP mobile number : Here’s how to avail : వోడాఫోన్‌ఐడియా (Vodafone Idea)గా ఉన్నటువంటి వీఐ (Vi) టెలికాం ఆపరేటర్ నుంచి ఇప్పుడు బంపర్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఫ్రీ డోర్‌స్టెప్ డెలివరీతో (Free Doorstep Sim Delivery) ఒక కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. వోడాఫోన్‌ఐడియా (Vodafone Idea) నెట్‌వర్క్ ఇప్పుడు వారికి నచ్చిన ఫ్యాన్సీ నంబర్‌ను లేదా లక్కీ నంబర్‌ను (Lucky number) ఎంచుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
వోడాఫోన్‌ఐడియా (Vodafone Idea) కస్టమర్‌లు వారి లక్కీ నంబర్ లేదా పుట్టిన తేదీ లేదా మీ జీవితంలో బాగా గుర్తుంచుకోదగిన తేదీల ఆధారంగా ప్రత్యేక నంబర్‌ను తీసుకోవాలనుకుంటే ఇదే మంచి సమయం. మీకు నచ్చిన నంబర్‌లను ఇప్పుడు మీ ఫోన్ నంబర్‌గా ఎంచుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది వీఐ (Vi).
ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు ఈ ప్రీమియం నంబర్‌లను పొందొచ్చు. ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, (Hyderabad) చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, జైపూర్‌లలో నగరాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. నచ్చిన మంచి నంబర్‌ను ఎంచుకుంటే చాలు.. కస్టమర్ ఇంటి దగ్గరకే వచ్చి సిమ్ డెలవరీ చేస్తుంది వోడాఫోన్‌ఐడియా నెట్‌వర్క్.
Also Read : Cannibalism: ఆ మూఢనమ్మకంతో నరమాంస భక్షణ-అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే కేసు
మీరు Vi నుంచి ఈ ఆఫర్‌ను ఇలా పొందవచ్చు..
ముందుగా Vi వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. తర్వాత ఈ కొత్త స్కీమ్ ట్యాబ్ మీకు కనిపిస్తుంది.
- అక్కడ మీరు ముందుగా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది.
- తర్వాత మీ పిన్-కోడ్, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.
- ఆ తర్వాత VIP మొబైల్ నంబర్‌ను ఎంచుకోండి.
- అక్కడ ఉండే ప్రీమియం మొబైల్ నంబర్‌ల జాబితా నుంచి గాని
లేదంటే మీ పుట్టినరోజు, పెళ్లి రోజు లేదా ఏదైనా మీ లక్కీ నంబర్ వంటి వాటి ఆధారంగా మీకు నచ్చిన నంబర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.
- తర్వాత ఆర్డర్ చేయడానికి మీ పేరు, చిరునామాను నమోదు చేయాలి.
- మీ కొత్త మొబైల్ కనెక్షన్ చెల్లింపునకు సంబంధించి ఒక OTPని వస్తుంది.
- జీరో డెలివరీ ఛార్జీలతో మీ ఇంటి వద్దకే కొత్త SIM డెలివరీ అవుతుంది.
ఇక Vi తన వినియోగదారుల కోసం నాలుగు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందుబాటులో ఉంచింది. రూ.155, రూ.239, రూ.666, రూ.699 ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది.
ఈ నాలుగు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, SMS వంటి బెనిఫిల్స్ ఉన్నాయి. అయితే ప్లాన్‌ను బట్టీ బెనిఫిట్స్ ఎక్కువగా కూడా ఉన్నాయి.
Also Read : Home guards salary hike: తెలంగాణ హోంగార్డులకు గుడ్ న్యూస్-30 శాతం వేతనం పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook