Fuel Price Today: ఇంధన ధరలపై మళ్లీ బాదుడే, సెంచరీ దాటిన డీజిల్ ధర, లేటెస్ట్ రేట్లు ఇలా

Fuel Price Hike Latest Updates: గత నెలలోనే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ మార్కు దాటగా, ఢిల్లీలో వందకు చేరువైంది. మధ్యప్రదేశ్‌లో డీజిల్ ఏకంగా రూ.100 దాటగా, పెట్రోల్ ధరలలో సెంచరీ దాటిన తాజా రాష్ట్రంగా సిక్కిం నిలిచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2021, 02:00 PM IST
  • గత నెలలోనే లీటరు పెట్రోల్ ధర పలు రాష్ట్రాల్లో రూ.100 మార్కు దాటింది
  • తాజాగా సిక్కిం రాష్ట్రంలో పెట్రోల్ ధరలు సెంచరీని అధిగమించాయి
  • మధ్యప్రదేశ్‌లో డీజిల్ ధర ఏకంగా రూ.100 మార్కు దాటడం గమనార్హం
Fuel Price Today: ఇంధన ధరలపై మళ్లీ బాదుడే, సెంచరీ దాటిన డీజిల్ ధర, లేటెస్ట్ రేట్లు ఇలా

Fuel Price Hike Latest Updates: ఇంధన ధరలు సామాన్యులకు, వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. డీజిల్ ధరలు సైతం పెట్రోల్ ధరలతో పోటీపడి పెరగడం డీజిల్ వాహనదారులకు సైతం ఇబ్బందికరంగా మారింది. గత నెలలోనే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ మార్కు దాటగా, ఢిల్లీలో వందకు చేరువైంది. మధ్యప్రదేశ్‌లో డీజిల్ ఏకంగా రూ.100 దాటగా, పెట్రోల్ ధరలలో సెంచరీ దాటిన తాజా రాష్ట్రంగా సిక్కిం నిలిచింది.

తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు మేర పెరగగా, డీజిల్ సైతం 18 పైసల చొప్పున పెరిగింది. దీంతో గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ ధర 34 పర్యాయాలు పెరగగా, డీజిల్ 33 పర్యాయాలు ఎగసింది. దేశ రాజధాని ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.99.51కు చేరుకోగా, డీజిల్ ధర రూ.89.36 అయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ వాహనదారులు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చూసి బెంబెలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌ (Fuel Price In Hyderabad)లో పెట్రోల్ ధర రూ.103.41కు చేరగా, డీజిల్ ధర రూ.97.20 అయింది. జిల్లాల విషయానికొస్తే హైదరాబాద్ కంటే అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Also Read: SBI Internet Banking Services: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం

ఏపీలోనూ గత నెలలోనే పెట్రోల్ సెంచరీ కొట్టింది. డీజిల్ సైతం మరో రెండుమూడు రోజుల్లో వంద రూపాయాలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.37 కాగా, ఒక లీడర్ డీజిల్ ధర రూ.99.13 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. నవ్యాంధ్ర (Andhra Pradesh) రాజధాని సరిహద్దు జిల్లాల్లోనూ పెట్రోల్ ధర రూ.106 వద్ద విక్రయం చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.105.58కి చేరగా, డీజిల్ ధర రూ.96.72 అయింది. 

Also Read: Also Read: Bank Holidays In July 2021: జులై నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్, మీ బ్యాంక్ పనులు షెడ్యూల్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News