Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత పెరిగిందంటే..

Gold Price Today August 20th 2022 :  ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4765గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5198గా ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 27, 2022, 08:08 AM IST
  • వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు
  • 22 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.150 మేర పెరిగిన ధర
  • 24 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.160 మేర పెరిగిన ధర
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలివే
Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత పెరిగిందంటే..

Gold Price Today August 27th 2022 : వరుసగా మూడో రోజు బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.160 మేర ధర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980కి చేరింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

హైదరాబాద్, విజయవాడల్లో బంగారం ధరలు:

తెలుగు రాష్ట్రాల్లోని  ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఇవాళ ఒకే ధరలు కొనసాగుతున్నాయి. ఈ 3 నగరాల్లో  ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. 

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,030గా ఉంది.

మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,010గా ఉంది. 

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా ఉంది. 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది.

వరుసగా మూడో రోజు బంగారం ధర పెరగడంతో.. ఈ 3 రోజుల్లోనే రూ.750 మేర ధర పెరిగినట్లయింది. గురు, శుక్రవారాల్లో రూ.320, రూ.270 మేర పెరిగిన ధర ఇవాళ రూ.160 మేర పెరిగింది. మొత్తంగా గడిచిన 10 రోజుల్లో బంగారం ధర నాలుగు సార్లు తగ్గి 3 సార్లు పెరిగింది. బంగారంపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా వివిధ నగరాల్లోని బంగారం ధరల్లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా స్థానిక జ్యువెలరీ వ్యాపారులను సంప్రదించడం ఉత్తమం. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ, దేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలు బంగారం ధరలపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపుతుంటాయి.

Also Read: Horoscope Today August 27th : ఇవాళ శ్రావణ మాసం చివరి రోజు.. ఏయే రాశుల జాతకం ఎలా ఉందంటే...

Also Read: DRDO CEPTAM Recruitment 2022: కేవలం డిగ్రీ, పదో తరగతి ఉత్తీర్ణతతో భారీ వేతనం పొందే జాబ్స్.. దరఖాస్తులకు డెడ్ లైన్ ఎప్పుడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News