Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: పసిడి ప్రియులకు ఇది గుడ్‌న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధర..ఇవాళ ఒక్కసారిగా తగ్గడంతో వినియోగదారులకు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2022, 04:54 PM IST
 Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: పసిడి ప్రియులకు ఇది గుడ్‌న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధర..ఇవాళ ఒక్కసారిగా తగ్గడంతో వినియోగదారులకు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం ధరలపై చాలా కారణాలు ప్రభావం చూపిస్తుంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కరోనా మహమ్మారి, వివిద దేశాల మధ్య భౌతిక పరిస్థితులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా ప్రతిరోజూ బంగారం ధర మారుతుంటుంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 45 వేల 8 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 970కు చేరింది. ఇక ముంబైలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 45 వేల 8 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 970కు చేరింది. ఇక కోల్‌కతాలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 47 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 380 రూపాయలకు చేరుకుంది. బెంగుళూరులో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 45 వేల 8 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 970 రూపాయలుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్‎లో (Hyderabad Gold Rate) 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 45 వేల 8 వందలుండగా,10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర 49 వేల 970 రూపాయలుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 45 వేల 8 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 970 రూపాయలుంది. 

Also read: Low Blood Pressure: లో బీపీ సమస్య మీకుందా..ఎలా అదుపు చేయాలి, లక్షణాలు ఎలా ఉంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News