Todays Gold Rate: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్, తగ్గిన ధర, దేశంలో ఇవాళ్టి ధరలు

Todays Gold Rate: బంగారం ప్రియులకు ఇది కాస్త ఊరట కల్గించే వార్త. బంగారం ధర కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 11, 2022, 06:51 AM IST
Todays Gold Rate: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్, తగ్గిన ధర, దేశంలో ఇవాళ్టి ధరలు

Todays Gold Rate: బంగారం ప్రియులకు ఇది కాస్త ఊరట కల్గించే వార్త. బంగారం ధర కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. ప్రతిరోజూ బంగారం ధరల్లో మార్పు వస్తుంటుంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, కరోనా మహమ్మారి, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. దేశంలోని వివిద నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 760 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 10 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 610 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 610 రూపాయలుగా ఉంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 720 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 790 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 860 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 560 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 5 వందలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 550 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 5 వందలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 550 రూపాయలుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు (Gold Rate)ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర (Hyderabad Gold Price) 44 వేల 6 వందలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 650  రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 560 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 550 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.  

Also read: Prices Hike: భారీగా పెరగనున్న ఏసీ, వాషింగ్ మెషీన్ల ధరలు, ఎప్పటి నుంచంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News