RBI On Credit Card Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డులకు సంబంధించి బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నిబంధనలు మార్చేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన క్రెడిట్ కార్డును ఎంచుకునే హక్కును కల్పించింది. అంతేకాదు కస్టమర్లే తమ బిల్లింగ్ సైకిల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. కస్టమర్లు కోరిన కార్డును ఇక నుంచి జారీ చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. క్రెడిట్ కార్డ్ జారీదారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు త్వరలోనే అమలులోకి రానున్నాయి.
Also Read: Viral Dance: టికెట్ వస్తే ఇంత ఆనందమా? 'జింబా'రే 'జింబా'రారే ఎమ్మెల్యే డ్యాన్స్ వైరల్
కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారులు కార్డ్ హోల్డర్లు వీసా, మాస్టర్ కార్డ్ వంటి ఏదైనా నెట్‌వర్క్‌ని ఎంచుకునే అవకాశం ఆర్‌బీఐ కల్పిస్తోంది. కార్డులు జారీ చేసే సమయంలోనే బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కార్డ్ నెట్‌వర్క్ ఆప్షన్‌ను కస్టమర్లకు ఇస్తాయి. అదేవిధంగా పాత కార్డు రెన్యూవల్ చేసుకునే సమయంలో కూడా కావాల్సిన కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. అయితే రూ.10 లక్షల కంటే తక్కువ యాక్టివ్ కార్డ్‌లను కలిగి ఉన్న క్రెడిట్ కార్డ్ జారీదారులకు ఈ ఆర్డర్ వర్తించదని ఆర్‌బీఐ తెలిపింది.
బిల్లింగ్ సైకిల్ విషయంలో కూడా ఆర్‌బీఐ కస్టమర్లకు ఉపశమనం కలిగించింది. క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన సౌలభ్యం ప్రకారం కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను మార్చుకోవచ్చు. ఒకేసారి కాకుండా ఎన్నిసార్లు అయినా ఛేంజ్ చేసుకోవచ్చు. గతంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఒకసారి మాత్రమే బిల్లింగ్ సైకిల్ మార్చుకునేందుకు అనుమతి ఇచ్చేవి. ఈ నిబంధనను ఆర్‌బీఐ రద్దు చేసింది.
కొత్త నిబంధనలు వర్తించాలంటే.. కస్టమర్లు పాత బకాయిలు పూర్తిగా చెల్లించి ఉండాలి. బిల్లింగ్ సైకిల్‌ను మార్చేందుకు ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా క్రెడిట్ కార్డ్ కంపెనీకి రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మొబైల్ యాప్ ద్వారా రిక్వెస్ట్ సెండ్ చేయవచ్చు. కస్టమర్లు తమ సౌలభ్యం, తమ వద్ద నగదు ఉన్న ప్రకారం బిల్లు సైకిల్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇక నుంచి తమకు కావాల్సిన నెట్‌వర్క్ కార్డును పొందడంతోపాటు బిల్లింగ్ సైకిల్‌ను కూడా సెట్ చేసుకునే అవకాశం రావడంతో కస్టమర్లకు ఎంతో ప్రయోజనం కలగనుంది. అయితే మార్చిన నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter