Google Lens: గూగుల్‌ లెన్స్‌ నుంచి మూడు అదిరిపోయే ఫిచర్లు..!!

Google Lens:ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ప్రవేశపెట్టిన ఫోటో రికగ్నైజేషన్‌ నూతన ఫిచర్‌తో వినియోగదారులకు సేవలందించనుంది. దీనిని డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో యూజర్లకు పరిచయం చేయనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 11:37 AM IST
  • గూగుల్‌ లెన్స్‌ నుంచి మరో మూడు ఫిచర్లు
  • మొదట క్రోమ్‌ ఓఎస్‌, మ్యాక్‌, విండోస్‌ యూజర్లకు
  • ఫైండ్‌ ఇమేజ్‌ సోర్స్‌ ఫిచర్‌
Google Lens: గూగుల్‌ లెన్స్‌ నుంచి మూడు అదిరిపోయే ఫిచర్లు..!!

Google Lens: ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ప్రవేశపెట్టిన ఫోటో రికగ్నైజేషన్‌ నూతన ఫిచర్‌తో వినియోగదారులకు సేవలందించనుంది. దీనిని డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో యూజర్లకు పరిచయం చేయనున్నారు.ఈ ఫిచర్‌ ద్వారా పనులను మరింత సులభంగా, తేలికగా పూర్తి చేయడానికి వీలుంటుందని సంస్థ అధికారులు తెలిపారు. ఇవేకాకుండా త్వరలో మూడు కొత్త ఫిచర్లను తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ఈ మూడు ఫిచర్లను ఎప్పుడు ప్రవేశపెడతారనేది సంస్థ ప్రకటించలేదు. ఈ ఫిచర్లను మొదట క్రోమ్‌ ఓఎస్‌, మ్యాక్‌, విండోస్‌ వంటి వాటిలో తీసుకురానున్నట్లు సమాచారం.

కొత్త ఫిచర్లు ఇవే: 

# ఫోటో మీద టెక్ట్స్‌ను కాపీ చేసేందుకు కాపీ ఫిచర్‌
# వేరే భాషల్లో ట్రాన్సిలేట్‌ చేసేందుకు వీలుగా ట్రాన్స్‌లేట్‌ ఫిచర్‌
# ఫైండ్‌ ఇమేజ్‌ సోర్స్‌ ఫిచర్‌

గూగుల్‌ లెన్స్‌ పనులు:
గూగుల్ లెన్స్‌ ప్రతి టెక్ట్స్‌నైనా చదివి వినిపించగలదు. చిన్న నోట్స్ నుంచి బుక్ పేపర్‌లో ఉండే క్లిప్పింగ్‌ వరకూ ప్రతిది చదివి వినిపిస్తుంది. అన్ని భాషల నుంచి సులభంగా ట్రాన్స్‌లేషన్‌ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. మనకు కావాల్సిన అన్ని టెక్ట్స్‌లను ఇది చదివి వినిస్తుంది.  దీని కోసం బ్రౌజర్‌లో లెన్స్‌ ఓపెన్ చేసి  ఫ్రేమ్‌ని అందులో డ్రాగ్‌ చెయ్యాలి. ఆ తరువాత గూగుల్ లెన్స్‌ టెక్ట్స్‌ని చదివి ఉన్నది ఉన్నట్లుగా వినిపిస్తుంది. దీని ద్వారా మీకు నచ్చిన బుక్‌ కానీ, వంటకం సంబంధించిన అంశాలను తెలుసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ఫొటో మీద క్లిక్ చేసి చేస్తే ఆ ఫొటో ఎక్కడ తీశారో గూగుల్ లెన్స్ ఆన్ తెలుపుతుంది.

Also Read: Luthiana Fire Accident: లూథియానాలో అగ్ని ప్రమాదం, ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవ దహనం

Also Read: Corona Fourth Wave: దేశంలో కరోనా భయం, భారీగా పెరిగిన మరణాలు..ఫోర్త్‌వేవ్ ఏం చేయనుంది..??

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News