Fact Check: సాధారణంగా మనకు విదేశాల్లో ఎవరైనా స్నేహితులు ఉన్నా లేక బంధుమిత్రులతోని విలువైన వస్తువులను అక్కడ నుంచి దిగుమతి చేసుకోవడం అనేది సాధారణ విషయమే ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఖరీదైన మద్యం కావచ్చు, ఇలా ఆభరణాలు కావచ్చు. ఇలా అనేక వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనేది మామూలుగా జరిగే విషయం.
అయితే విదేశాల నుంచి మనం ఏ వస్తువు తెచ్చుకున్నా కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు అనుమతి తీసుకోవడం అనేది తప్పనిసరి. అయితే పరిమితికి మించి మాత్రమే ఏదైనా వస్తువును మనం భారతదేశానికి తెచ్చుకుంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారి అనుమతి అవసరం. కానీ పరిమితిలోగా ఉన్న వస్తువులకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. కానీ ఇటీవల కాలంలో కొన్ని ఫోన్ నెంబర్ల ద్వారా ప్రజలకు ఫోన్లు వస్తున్నాయి.
ఇందులో మేము కస్టమ్స్ ఆఫీసర్లమని మీ పేరిట పార్సిల్ వచ్చిందని చెబుతూ ఫోన్లు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ మీకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పొందేందుకు కొంతమంది సైబర్ దొంగలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైన అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తూ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా ట్విట్టర్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది.
Have you received calls claiming to be from Customs Dept. even when you haven't ordered something❓
𝐁𝐞𝐰𝐚𝐫𝐞 ‼️
✔️It's a scam
✔️Indian Customs never call/SMS to pay customs duty in personal bank A/Cs
✔️Verify all communications of Indian Customs with DIN on CBIC's website pic.twitter.com/bwrwnZh33g
— PIB Fact Check (@PIBFactCheck) October 29, 2024
Also Read : Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు చెక్కు అందజేత
కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పిఐబి తెలిపింది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావని, వారు వ్యక్తిగతంగా ఎవరికి ఫోన్ చేయరని, ఒకవేళ మీకు అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, లేదా సైబర్ నేర విభాగానికి కంప్లైంట్ ఇవ్వాలని సూచించింది. అలాగే పౌరులు ఎలాంటి సమాచారాన్ని అలాంటి ఫ్రాడ్ వ్యక్తులతో పంచుకోకూడదని కూడా హెచ్చరించింది.
గతంలో ఇలాగే చాలామంది తమ బ్యాంకు పాస్వర్డ్ లను, అదేవిధంగా క్రెడిట్ కార్డు డీటెయిల్స్, పాన్ కార్డు డీటెయిల్స్, ఆధార్ కార్డు డీటెయిల్స్, పంచుకోవడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయారు. ప్రస్తుత కాలంలో పాన్ కార్డు ఆధార్ కార్డు వంటి డీటెయిల్స్ సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడినట్లయితే, మీ అకౌంట్లో డబ్బులు సైతం కాజేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.