Gold Rate Today: తగ్గినట్లే తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు..తాజాగా తులం బంగారం ధర ఎంతంటే?

Gold Price Today: గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు రెండు మూడు రోజులుగా పెరుగుతున్నాయి. శ్రావణమాసం పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత తగ్గుతుందని ఆశపడిన వారికి పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా షాకిస్తున్నాయి. కాగా నేడు దేశంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. 

Written by - Bhoomi | Last Updated : Aug 12, 2024, 06:18 AM IST
Gold Rate Today: తగ్గినట్లే తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు..తాజాగా తులం బంగారం ధర ఎంతంటే?

Gold And Silver Prices In Hyderabad :   బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల బాట పడుతున్నాయి. తాజాగా బంగారం విషయానికొస్తే పసిడి ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఆగస్టు 12 సోమవారం హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల ధర  బంగారం ధర రూ. 70,210 పలుకుతుండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,450 పలుకుతోంది. బంగారం ధరలు గతవారం హెచ్చుతగ్గులకు గురయ్యాయి. గత వారం ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత గురు శుక్ర, శనివారాల్లో బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల బాట పట్టాయి.

 ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు ఆందోళన నెలకొంది.  బంగారం ధరలు  హెచ్చుతగ్గుల వెనక అనేక కారణాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు.  బంగారం ధరలు పెరుగుదలకు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలోని లావాదేవీలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనైనప్పుడు పెట్టుబడిదారులు తమ సురక్షితమైన పెట్టుబడులుగా బంగారంలో ఇన్వెస్ట్ చేశాను రేపు ఇష్టపడతారు.  అలాంటప్పుడు డిమాండ్ పెరిగిన కారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. 

Also Read : Hindenburg Research: హిండెన్ బర్గ్ రీసెర్చ్ వెనుక ఎవరు ఉన్నారు...వీళ్ల ఆదాయ మార్గం ఏంటి..? మార్కెట్లో అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి..? 

మరోవైపు బంగారం ధరలు ప్రస్తుతం అంతర్జాతీయంగా గమనించినట్లయితే 2400 డాలర్ల వద్ద ఒక ఔన్స్ బంగారం ధర ట్రేడ్ అవుతోంది.  ఈ స్థాయి నుంచి బంగారం ధరలు మునుముందుకు పెరుగుతున్నాయి.  దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణము కూడా బంగారం ధరలు పెరిగేందుకు దోహదపడుతోంది. ఇప్పటికి ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య  వివాదం తీవ్రతరం అవుతోంది. మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకోవడం  ఖాయమంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఒకవేళ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధరలు ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. 

 ఇక చూస్తుండగానే శ్రావణమాసం రెండవ వారంలోకి ప్రవేశించింది ఈ శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున బంగారం ఆభరణాల  వ్యాపారం కొనసాగుతుంది.  ఈ సంవత్సరం బంగారం ధరలు గత ఏడాదితో పోలిస్తే పెరిగినప్పటికీ కస్టమర్ల నుంచి మాత్రం ఏ మాత్రం ఆసక్తి తగ్గడం లేదు.  తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ,  విశాఖపట్నం,  తిరుపతి,  నెల్లూరు,  గుంటూరు  వంటి ప్రధాన నగరాల్లో  నగల షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇదిలా ఉంటే వ్యాపారులు మాత్రం కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై సుంకం తగ్గించడంతో,  అటు ఆభరణాల తయారీదారులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. . ఇదిలా ఉంటే ఈ శ్రావణమాసం అనంతరం కూడా బంగారం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుందని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి నిపుణులు అంచనా వేస్తున్నారు.  దీనికి తోడు అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడి ఉంటుంది.  దీని ప్రభావం కూడా బంగారం పై ప్రత్యక్షంగా పడే అవకాశం ఉంటుంది.

Also Read : Independence Day Recipes : ఆగస్టు 15న త్రివర్ణంలో ఈ స్పెషల్ వంటకాలు మీ పిల్లల కోసం ట్రై చేయండి..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News