Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్..వాటికి మాత్రం ఫుల్ డిమాండ్..తగ్గేదేలే

Real Estate: హైదరాబాద్.. దేశవ్యాప్తంగానే..కాదు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంది. దేశంలో ఎక్కడా లేనన్ని సదుపాయాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అందుకే దేశం చూపు హైదరాబాద్ వైపు ఉంటుంది. పలు రాష్ట్రాల నుంచి వలస వచ్చినవాళ్లు లక్షలాది మంది హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం హైదరాబాద్ లో ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ పరంగానూ హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడుతుంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ రంగంలో హైదరాబాద్ తన సత్తా ఏంటో నిరూపిస్తోంది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది. జులై, సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. కానీ ఆఫీసులకు మాత్రం భారీగా డిమాండ్ పెరిగింది. మరి హైదరాబాద్ లో ఇండ్ల అమ్మకాలు తగ్గడానికి కారణమేంటి? తెలుసుకుందాం. 

Written by - Bhoomi | Last Updated : Sep 27, 2024, 03:24 PM IST
Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్..వాటికి మాత్రం ఫుల్ డిమాండ్..తగ్గేదేలే

 Office Space Demand In Hydeabad:  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. ఈ నగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేండ్లు హైదరాబాద్ నగరంలో దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం మారుమ్రోగుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ సిటీ దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో భూములు, ఇండ్ల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. ఆ మధ్య కాలంలో కోకాపేటలో ఎకరం భూమి రూ.100కోట్లకుపైగా పలికిందంటే ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుంది. కోకాపేట ఒక్కటే కాదు ఇలాంటి డీల్స్ ఎన్నో జరిగాయి. ఈ క్రమంలోనే ఇండ్లు, ప్లాట్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సామాన్యులు అద్దెలు కూడా చెల్లించలేనంతగా పెరిగాయి. ధరలు ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం అస్సలు తగ్గలేదు. అయితే రేట్లు పెరుగుతున్నా కొద్దీ అమ్మకాలు కూడా ఆ రేంజ్ లోనే పెరిగాయి.  దేశంలోని దిగ్గజ రియల్ ఎస్టేట్ నగరాలైన ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు, చెన్నైలను పక్కన నెట్టి హైదరాబాద్ రికార్డ్ క్రియేట్ చేసింది. 

సీన్ అంతా రివర్స్: 

కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది. జులై-సెప్టెంబర్ నెలల్లో ఒక్కసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. దాదాపు 11శాతం ఇండ్లు లేదా ప్లాట్ల విక్రయాలు తగ్గిపోయాయి. 2023 జులై -సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 1,20,290 ఇండ్లే లేదా ఫ్లాట్స్ అమ్ముడు పోయాయి. ఈ ఏడాది ఇదే సమయంలో ఆ సంఖ్య 1,07,060గా ఉంది. అయితే ఇండ్ల అమ్మకాయి పడిపోయినప్పటికీ సగలు ధరలు మాత్రం వార్షిక ప్రాతిపదికన చూస్తే 23శాతం పెరిగినట్లు స్థిరాస్థి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ పేర్కొంది. 

Also Read:  Success Story: ఆమె సంకల్పం ముందు పేదరీకం ఓడింది.. ఆర్థిక కష్టాల్లో నుంచి పుట్టిన ఒక ఆలోచన.. ఆమె జీవితాన్నే మార్చేసింది

ఇండ్ల అమ్మకాల్లో దూసుకెళ్లిన హైదరాబాద్: 

ఇండ్ల అమ్మకాల్లో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలను దాటవేసిన హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఆ స్థాయి డిమాండ్ కనిపిచండం లేదు. దేశీయ ప్రధాన నగరాల మాటెలా ఉన్నా..హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాత్రం ఎప్పుడూ ఫుల్ జోష్ గానే ఉంటుంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నాడు మార్కెట్లో పరిస్ధితుల్లో నిమిత్తం కూడా హైదరాబాద్ లో ఇండ్లు కొనుగోళ్లు భారీగా జరిగితే..నేడు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత పది సంవత్సరాల్లో నిర్మాణ రంగానికి అప్పటి సర్కార్ పెద్ద పీట వేసింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీగా పడపోవడానికి కారణంగా హైడ్రానే అని తెలుస్తోంది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో ఇండ్ల ధరలు భారీగా తగ్గాయని చెబుతున్నారు. 

అనరాక్ డేటా ప్రకారం: 

హైదరాబాద్ సహా టాప్ 7 నగరాల రియాల్టీపై గురువారం అనరాక్ ఓ డేటాను రిలీజ్ చేసింది. దీనిలో ఈ జులై-సెప్టెంబర్ లో ఇండ్ల విక్రయాలు గతంతో పోల్చితే 22శాతం పడిపోయినట్లు తేలింది. కోల్ కతా తర్వాత ఇదే అత్యధికమని పేర్కొంది. పోయినసారి 16, 375 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. కానీ ఈసారి అవి 12, 735 యూనిట్లుగానే ఉన్నాయని తెలిపింది. 

భారీగా పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్: 

అయితే ఇండ్ల విక్రయాలు తగ్గినప్పటికీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ మాత్రం జులై సెప్టెంబర్ క్వార్టర్స్ లో భారీగా పెరిగింది. ఇది హైదరాబాద్ బెంగళూరుల్లోనే ఎక్కువగా జరిగినట్లు కొలియర్స్ ఇండియా రిపోర్టు వెల్లడించింది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్ 2023 ఏడాది ఇదే త్రైమాసికంలో 13.2 మిలియన్ చదరపు అడగులు ఉండా ..ఈఏడాది 31శాతం పెరిగినట్లు పేర్కొంది. 

Also Read: Success Story : అసాధ్యం అనే పదానికి అర్థం తెలియని సుసాధ్యుడు.. జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర జీవన ప్రస్థానం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x