ICICI FD Rate Hike: గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్..1 లక్ష ఎఫ్‌డీపై ఎంత వడ్డీ అంటే..?

ICICI FD Rates: దేశంలో దిగ్గజ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈమధ్యకాలంలో పలు బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచిన విషయం  తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. సవరించితన తర్వాత ఇప్పుడు అత్యధికంగా 7.25శాతం వడ్డీ అందుతుంది. సీనియర్ సిటిజన్లకు 7.80శాతం వడ్డీ లభిస్తుంది. తాజా ఎఫ్డీ రేట్లు ఉన్నాయో చూద్దాం.   

Written by - Bhoomi | Last Updated : Aug 6, 2024, 03:54 PM IST
 ICICI FD Rate Hike: గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్..1 లక్ష ఎఫ్‌డీపై ఎంత వడ్డీ అంటే..?

FD Rates Hike: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వడ్డీరేట్లను సవరిస్తూ కీలక ప్రకటన చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన ఎఫ్డీ రేట్లు రూ. 3కోట్ల వరకు వర్తించనున్నాయని వెల్లడించింది. సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీని అందిస్తుంది. 7.80శాతం వడ్డీ నిర్ణయించింది బ్యాంక్. ఈ మేరకు సవరించిన రేట్లను అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. టెన్యూర్ ను బట్టి వడ్డీరేట్లు పెరిగాయి. 

బ్యాంక్ తన ఎఫ్డీ వడ్డీ రేటును 15 నెలల నుండి రెండు సంవత్సరాల కాలానికి ఐదు బేసిస్ పాయింట్లు పెంచింది. గరిష్ట రేటు 7.20 శాతం నుండి 7.25 శాతానికి పెరిగింది. 18 నెలల నుంచి 2 సంవత్సరాల కాలపరిమితి రేటును 7.20 శాతం నుంచి 7.25 శాతానికి పెంచింది. రెండేళ్లు, ఐదేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే FDలు 7 శాతం వడ్డీ రేటును అందిస్తాయి. ఐదు సంవత్సరాలు, వారం రోజుల  నుండి 10 సంవత్సరాల వరకు చూస్తే సాధారణ ప్రజలకు 3శాతం నుంచి గరిష్టంగా 7.25శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే అదనంగా 55 బెసిస్ పాయింట్ల వరకు వడ్డీని ఎక్కువగా అందిస్తుంది. అన్నింటికంటే ఎక్కువగా 15 నెలల నుంచి 18నెలల వ్యవధి టెన్యూర్ డిపాజిట్లకే ఉంది.  

Also Read: IPO: స్టాక్ మార్కెట్లో దుమ్మురేపుతోన్న మరో ఐపీఓ..తొలిరోజే ఇన్వెస్టర్లకు లాభాల పంట..!!

ఐసిఐసిఐ బ్యాంక్ రెగ్యులర్ సిటిజెన్లకు వడ్డీరేట్లు చూసినట్లయితే..వీరికంటే సీనియర్లకు 55 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు  7- 29 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 3 శాతం వడ్డీని చెల్లిస్తుంది. 30- 45 రోజుల మధ్య చెల్లించాల్సిన FDలు 3.5 శాతం వడ్డీ రేటును అందిస్తాయి. బ్యాంక్ 46 నుండి 60 రోజులలో చెల్లించాల్సిన FDలపై 4.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.61- 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలు 4.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 91 రోజుల నుండి 184 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలు మీకు 4.75 శాతం ఇస్తుంది. 185- 270 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 271 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ కాల వ్యవధిలో ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సరం లేదా పదిహేను నెలల లోపు గడువు ముగిసే ఫిక్స్‌డ్-టర్మ్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. 

Also Read: FirstCry IPO: నేటి నుంచి ఫస్ట్ క్రై ఐపీవో ప్రారంభం..మినిమం ఎన్ని షేర్లకు బిడ్ దాఖలు చేయాలి..ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 

ఉదాహరణకు మనము 18నెలల కాలానికి జనరల్ కేటగిరి వడ్డీ రేట్లను పరిశీలించినట్లయితే..రూ. 5లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీకి రూ. 53, 986 రూపాయలు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.8శాతం వడ్డీతో రూ. 5,58,078చేతికి అందుతుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News