ITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, 1 రూపాయి తప్పున్నా నోటీసులొచ్చేస్తాయి జాగ్రత్త

ITR Filing Mistakes: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. మరో నెలరోజులే గడువు మిగిలింది. ఈ నేపధ్యంలో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏ చిన్న పారపాటు కూడా లేకుండా చూసుకోవల్సిందే. లేకపోతే నోటీసులు అందుకోవల్సి ఉంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 29, 2024, 05:42 PM IST
ITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, 1 రూపాయి తప్పున్నా నోటీసులొచ్చేస్తాయి జాగ్రత్త

ITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో మీరు సమర్పించ ఆదాయ, ట్యాక్స్ వివరాల్లో తేడా ఉండకూడదు. ఏ మాత్రం తేడా వచ్చినా మీ ఆదాయం ఎక్కడ్నించి వచ్చిందనే వివరాలు కోరుతూ నోటీసులు పంపిస్తుంది. ఈ పరిస్థితి నివారించాలంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో ఉన్నారు. జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. జూలై 31 తరువాత డిసెంబర్ 31లోగా అయితే 5 వేల రూపాయల జరిమానాతో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈసారి లక్షలాదిమంది ట్యాక్స్ పేయర్లు తొలిసారిగా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది తప్పులు చేస్తుంటారు. ఫలితంగా ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకుంటారు. నోటీసులనగానే చాలామందికి ఆందోళన కలుగుతుంది. ఇన్‌కంటాక్స్ శాఖ నిబంధనల ప్రకారం నోటీసులకు స్పందించకుంటే విచారణ ఎదుర్కోవల్సి ఉంటుంది. అందుకే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లోనే ఎలాంటి తప్పుల్లేకుండా చూసుకోవడం మంచిది. 

ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 142 ప్రకారం రిటర్న్ ఫైల్ చేయకుంటే నోటీసు జారీ అవుతుంది. అంతేకాకుండా బ్యాంకు వడ్డీ, దీర్ఘ కాలిక షేర్ మార్కెట్ లాభాలు, ఆస్థు అమ్మకం వంటి వివరాలకు సంబంధించిన సమాచారం కోరుతూ నోటీసులు పంపిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో తప్పులు దొర్లినా లేక ట్యాక్స్ ఎగవేతలో తేడాలొచ్చినా నోటీసులు జారీ అవుతుంటాయి. ఈ పరిస్థితుల్లోనే ఆదాయంకు సంబంధించిన మరింత సమాచారం కోరుతుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనివారికి కూడా ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు వస్తాయి. 

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో తప్పు ఎందుకు జరిగింది, ఎలా జరిగందనే వివరాలను ఇన్‌కంటాక్స్ శాఖ నోటీసుల ద్వారా తెలుసుకుంటుంది. మీ ఆదాయం వర్సెస్ సమర్పించిన వివరాలు సరిపోలనప్పుడు అందుకు సంబంధించిన కారణం వివరించాల్సి ఉంటుంది. ఆఖరికి ఒక్క రూపాయ తేడా వచ్చిన ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోవల్సి ఉంటుంది. 

Also read: Jio Recharge Plan: రిలయన్స్ జియోలో ఏ ప్లాన్ ఎంత పెరిగింది, ఎప్పట్నించి అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News