ITR Filing 2024: మీ ఆదాయం ఇన్‌కంటాక్స్ కనీస పరిమితి దాటితే తప్పకుండా ప్రతి యేటా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. అంటే ఇంకా 15 రోజులో గడువు ఉంది. ఈలోగా ఉద్యోగస్థులు, ట్యాక్స్ పేయర్లు అంతా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. జూలై 31 తరువాత అంటే గడువు తేదీ తరువాత రిటర్న్స్ ఫైల్ చేయవచ్చా లేదా
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎప్పుడూ గడువు తేదీలోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి యేటా గడువు తేదీ జూలై 31 ఉంటుంది. నిర్ణీత సమయంలోగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలుంటాయి. ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి రిఫండ్ రావల్సి ఉంటే త్వరగా వచ్చేందుకు వీలుంటుంది. హోమ్ లోన్, కారు లోన్ కావలిస్తే లోన్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది. అందుకే చాలామంది నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల ఆలస్యమౌతుంటారు. అదే జరిగితే ప్రత్యామ్నాయం ఉందా, అంటే గడువు తేదీ తరువాత రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అవకాశముందా అంటే బిలేటెడ్ రిటర్న్స్‌కు ఆస్కారముందని చెప్పవచ్చు.
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ అనేవి ఎప్పుడూ వీలైనంతవరకూ నిర్ణీత సమయంలోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా కారణంతో ఆలస్యమైతే డిసెంబర్ 31 వరకూ మరో గడువు ఉంటుంది. అదే బిలేటెడ్ రిటర్న్స్. ఎప్పుడైనా ఏదైనా అనుకోని కారణాలతో ఆలస్యమైనప్పుడు మరో అవకాశమిచ్చేందుకు ఇన్‌కంటాక్స్ శాఖ ఈ వెసులుబాటు కల్పించింది. అంటే జూలై 31 లోగా ఐటీ రిటర్న్స్ పైల్ చేయకుంటే డిసెంబర్ 31 వరకూ మరో అవకాశముంటుంది. అయితే బిలేటెడ్ రిటర్న్స్‌కు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా అనేది మీ ఆదాయంను బట్టి ఉంటుంది. మీ వార్షిక ఆదాయం 5 లక్షల్లోపుంటే 1000 రూపాయలు లేట్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అదే వార్షిక ఆదాయం 5 లక్షలు దాటితే మాత్రం జరిమానా 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాతో పాటు ట్యాక్స్ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ అనేది ఆగస్టు 1 నుంచి మీరు రిటర్న్స్ పైల్ చేసే వరకూ లెక్కిస్తారు.
ఐటీ రిటర్న్స్ నిర్ణీత సమయంలోగా ఫైల్ చేయకపోతే ఇంకా నష్టాలు కూడా ఉన్నాయి. అంటే గత ఏడాది స్టాక్ మార్కెట్ లేదా వ్యాపారంలో జరిగిన నష్టాన్ని వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయలేడు. బిలేటెడ్ రిటర్న్స్‌లో ఇంటి ఆస్థికి సంబంధించిన నష్టాన్ని మాత్రమే పూడ్చుకునేందుకు అవకాశముంటుంది. అందుకే వీలైనంతవరకూ సకాలంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. చివరి నిమిషం వరకూ నిరీక్షిస్తే లేనిపోని సమస్యలు ఎదురౌతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook