IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ చివరి తేదీ ఎప్పుడు, అసలు రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయాలి, లేకపోతే ఏమౌతుంది

IT Returns: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్. మీ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు మరో 20 రోజులే సమయం మిగిలింది. జూలై 31 లోగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతాయనేది తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 11, 2023, 05:42 PM IST
IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ చివరి తేదీ ఎప్పుడు, అసలు రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయాలి, లేకపోతే ఏమౌతుంది

IT Returns: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి జూలై 31 చివరి తేదీ. ట్యాక్స్ పేయర్లుగా ఉండే ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు, ఐటీ రిటర్న్స్  దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి లేదా 2023-24 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి నిమిషం వరకూ ఆగితే ఇబ్బందులు ఎదురౌతాయి. అందుకే వీలైనంతవరకూ త్వరగా ఫైల్ చేయడం మంచిది. జూలై 31 లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే ఏం జరుగుతుందనే సందేహం అందరిలా మీకూ ఉన్నట్టుంది. గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కచ్చితంగా సమస్యలు ఎదురౌతాయి. ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 139 ప్రకారం ట్యాక్స్ పేయర్లు పరిమితికి మించి ఆదాయం ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. గడువు దాటితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది ఆదాయం 5 లక్షల్లోపున్నా లేదా ఎక్కువ ఉన్నా పెనాల్టీ ఉండదు.  కానీ రిటర్న్స్ గడువులోగా ఫైల్ చేయకపోతే ఇన్‌కంటాక్స్ చట్టం 1961 సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం జరిమానా 5 లక్షల్లోపు ఆదాయమైతే 1000 రూపాయలు, అంతకుమించి ఉంటే 5000 రూపాయలు ఫైనల్ చెల్లించడం ద్వారా డిసెంబర్ 31 వరకూ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.

చాలామంది జూలై 31 తరువాత గడువు తేదీ పొడిగిస్తారనే ఆలోచనలో ఉంటారు. కానీ గడువు పొడిగించేందుకు అవకాశాల్లేవు. అందుకే జూలై 31 లోగా రిటర్న్స్ ఫైల్ చేయడం మంచిది. డిసెంబర్ 31లోగా జరిమానాతో కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే చట్టరపరమైన సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అంటే ముందుగా ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు అందుకుంటారు. ఒక్కోసారి రెండేళ్ల వరకూ జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. గత ఏడాది ఐటీ రిటర్న్స్ కూడా ఇప్పుడు ఫైల్ చేసే అవకాశాలుంటాయి. వివరణ క్షమాపణలు కోరుతూ ఆన్‌లైన్‌లో రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 

ఐటీ రిటర్న్స్ పైల్ చేయడం వల్ల ప్రయోజనాలు కూడా లేకపోలేదు. వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, గృహ రుణాల మంజూరు సులభతరమౌతుంది. వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇన్‌కం, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. 

Also read: IT Refund Scam: మీ ఐటీ రిఫండ్ క్లెయమ్ లక్ష రూపాయలు దాటిందా తస్మాత్ జాగ్రత్త , ఐటీ నుంచి నోటీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News