Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు, ఆఖరు తేదీ వివరాలు ఇలా

Railway Jobs: నిరుద్యోగులకు శుభవార్త. భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరుతున్నాయి. భారతీయ రైల్వే..పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 16, 2022, 06:30 PM IST
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు, ఆఖరు తేదీ వివరాలు ఇలా

భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే ఇదే మంచి అవకాశం. ఇండియన్ రైల్వేస్ బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అది కూడా కేవలం ఇంటర్, పదవ తరగతి అర్హతతో సాధించగలిగే ఉద్యోగాలు. 

ఇండియన్ రైల్వేస్‌లో పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇందుకు సంబంధంచి రైల్వే రిక్రూట్‌మెంట్ 2022 విడుదలైంది. మొత్తం 2,422 పోస్టులు భర్తీ కానున్నాయి. సెంట్రల్ రైల్వేలో ఉన్న ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం ఇండియన్ రైల్వే అధికారిక వెబ్‌‌సైట్ https://www.rrccr.com సందర్శించాల్సి ఉంటుంది.

సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ జనవరి 15, 2023 సాయంత్రం 5 గంటల వరకూ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 15-24 సంవత్సరాలుండాలి. జనరల్ కేటగరీ అభ్యర్ధులకు పరీక్ష ఫీజు 100 రూపాయలు కాగా, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్ధులు ఏ విధమైన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 

రైల్వే అప్రెంటిస్ పోస్టులకు విద్యార్హత ఇంటర్ లేదా పదవ తరగతి మాత్రమే. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసేందుకు, మరిన్ని వివరాలకు https://www.rrccr.com వెబ్‌సైట్ సందర్శించాలి. 

Also read: Samsung Galaxy M04: శాంసంగ్ ఎం సిరీస్‌లో మరో అద్భుత ఫోన్ లాంచ్, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News