IRCTC Tour Package: మీ ట్రావెలింగ్, పర్యాటక కలల్ని సాకారం చేసే అద్భుతమైన టూరిస్ట్ ప్యాకేజ్‌ను ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టింది. అదే అందమైన ఊటీ పర్యాటకాన్ని మీకు అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల అందమైన ఊటీ టూరిస్ట్ డెస్టినేషన్ ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మీకు అందమైన లోయలు, పర్వతాలు, ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనాన్ని పరిచయం చేసే ఊటీ ప్యాకేజ్ ప్రతి మంగళవారం నాడు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమౌతుంది. మీ స్థోమత, సౌకర్యానికి తగ్గట్టుగా స్లీపర్ లేదా థర్డ్ క్లాస్ ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. ఈ ప్యాకేజ్ ధర 9410 రూపాయల్నించి 26 వేల వరకూ బడ్జెట్ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్యాకేజ్‌లో ఐఆర్సీటీసీ హోటల్ వసతి, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటాయి. దీనికితోడు అటూ ఇటూ తిరిగేందుకు ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. వ్యక్తిగత, అదనపు సేవలు లేదా ఖర్చులు మాత్రం ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది.
ఐఆర్సీటీసీ అందిస్తున్న ఊటీ పర్యాటక ప్యాకేజ్ రెండు కేటగరీల్లో ఉంటుంది. ఇండివిడ్యువల్ ట్రావెల్లర్లకు స్లీపర్ క్లాస్ అయితే ఒక్కొక్కరికి 24,760 రూపాయలు కాగా థర్డ్ క్లాస్ అయితే 26,090 రూపాయలుంటుంది. అదే డబుల్ బుకింగ్ అయితే థర్డ్ ఏసీకు 14,120 రూపాయలు కాగా, స్లీపర్ అయితే 12, 780 రూపాయలుంటుంది. ఇక త్రిపుల్ షేరింగ్ ఏసీ థర్డ్ క్లాస్ అయితే 11,120 రూపాయలు కాగా 9,780 రూపాయలు ఉంటుంది.
5-11 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు కూడా ఈ టూర్ ప్యాకేజ్ వర్తిస్తుంది. బెడ్ వసతి కోసం స్లీపర్ తరగతిలో 5,920 రూపాయలు కాగా, థర్డ్ ఏసీ అయితే 7,250 రూపాయలుంటుంది. బెడ్ లేకుండా అయితే స్లీపర్ తరగతికి 5300 రూపాయలు, థర్డ్ ఏసీకు 6,640 రూపాయలుంది. అందమైన ఊటీ అనుభవాన్ని ఆస్వాదించాలంటే ఇది నిజంగానే అద్భుతమైన ప్యాకేజ్.
Also read: Financial Tips: సెప్టెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాల్సిన పనులు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook