March 31 Deadline: మార్చ్ 31 లోగా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 5 ముఖ్యమైన పనులివే

March 31 Deadline: ప్రతి ఏటా మార్చ్ 31 అంటే ఆర్ధిక సంవత్సరం చివరి రోజు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం మార్చ్ 31 చివరి రోజుగా నిర్ణయించింది. గడువులోగా ఆ పనులు పూర్తి చేయకపోతే చాలా ఇబ్బందులు కలగవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2023, 01:21 PM IST
March 31 Deadline: మార్చ్ 31 లోగా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 5 ముఖ్యమైన పనులివే

March 31 Deadline: ఆర్ధికపరమైన పనులకు మార్చ్ 31 చివరి రోజు. ప్రభుత్వం నిర్దేశించిన ఈ గడువు తేదీలోగా  పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ ఆ పనులు పూర్తి చేయకపోతే చాలా నష్టం ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే ఈ ఏడాది మార్చ్ 31 అత్యంత ముఖ్యమైంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇదే చివరి రోజు. చాలా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వం సూచించిన గడువు తేదీ. 

మార్చ్ 31లోగా చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు

1. పాన్ కార్డును ఆధార్ కార్డులో ఇంకా అనుసంధానం చేయకపోతే మార్చ్ 31 చివరి తేదీ. లేకపోతే పాన్ కార్డు ఏప్రిల్ 1 నుంచి డీ యాక్టివేట్ కానుంది. ఆ తరువాత ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరు. ఏప్రిల్ 1 నుంచి ఈ పని చేయాలంటే 10 వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

2. పీఎం వయ వందన యోజనలో సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పెట్టాలంటే మార్చ్ 31 చివరి తేదీ. ఈ పధకం పొడిగించే విషయమై ప్రభుత్వం ఇంకా ఏ విధమైన నోటిఫికేషన్ జారీ చేయనందున మార్చ్ 31లోగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 

3. ట్యాక్స్ ప్లానింగ్ ఇంకా చేయకపోతే ఇదే చివరి అవకాశం. 2022-23 ఆర్ధిక సంవత్సరం ట్యాక్స్ మినహాయింపు పొందాలంటే పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పధకాల్లో మార్చ్ 31 లాగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

4. ఎల్ఐసీ పాలసీ అధిక ప్రీమియంపై ట్యాక్స్ రిబేట్ పొందాలంటే..మార్చ్ 31 చివరి తేదీ. ఆ తరువాత అంటే ఏప్రిల్ 1 నుంచి ఏ విధమైన ట్యాక్స్ మినహాయింపు ఉండదు. 

5. మ్యూట్యువల్ ఫండ్స్ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే వెంటనే చేయాల్సి ఉంటుంది. మార్చ్ 31 తేదీ లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. లేకపోతే మీ మ్యూట్యువల్ ఫండ్ ఎక్కౌంట్ ఫ్రీజ్ అవుతుంది. 

Also read: Positive Pay System: పీఎన్‌బీ బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక.. చెక్ లావాదేవిల్లో కీలక మార్పు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News