Knowledge Story: భారతదేశంలో రూపాయిని కరెన్సీగా ఉపయోగిస్తారు. మనం ఏదైనా వస్తువు కొనడానికి డబ్బు మాత్రమే వినియోగిస్తాం. మనదేశంలో 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లు చలామణీలో ఉన్నాయి. దాదాపుగా 5 ఏళ్ల క్రితం పాత కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ.. కొత్త వాటిని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. అయితే కొత్త నోట్లను మీరు చాలా సార్లు గమనించే ఉంటారు. కానీ, ఆ కరెన్సీ నోట్లపై ఒక వేపున ఉండే గీతలను గమనిస్తే.. అవి ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా సందేహం వచ్చిందా? అవును, ఇప్పుడు వాటి గురించి తెలుసుకోనున్నాం.
మీరు కొత్త కరెన్సీ నోట్లను చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పది రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు నోట్ల అంచున ఉన్న లైన్లు వేర్వేరుగా ఉన్నట్లు గుర్తిస్తారు. అంటే 2 రూపాయల నోటులో తక్కువ లైన్లు.. 2000 రూపాయల నోటులో ఎక్కువ లైన్లు ఉంటాయి. నోటు విలువను బట్టి ఈ పంక్తులు హెచ్చుతగ్గులకు గురవుతాయని మీకు తెలియజేద్దాం. ఈ పంక్తులు, వాటి అర్థం గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాం.
కరెన్సీ నోట్లకు పక్కగా ఉండే ఈ గీతలను 'బ్లీడ్ మార్క్స్' అంటారు. ఈ లైన్లు దృష్టిలోపం ఉన్నవారి కోసం తయారు చేయబడినవి కాబట్టి ఇవి ప్రత్యేకమైనవి. నోట్లను కళ్లతో చూడలేని వారు ఈ లైన్ల ద్వారా నోట్ల విలువను అర్థం చేసుకోవచ్చు. తద్వారా వారిని ఎవరూ మోసం చేయలేరు. అంధులు రూ.50 నోటు లేదా రూ.2000 నోటు ఈ లైన్లపై వేళ్లను కదిపడం ద్వారా నోటు విలువను తెలుసుకోవచ్చు.
అంధుల సౌకర్యార్థం తయారు చేసిన ఈ లైన్లు ఒక్కో నోటుపై ఒక్కో విలువను బట్టి ఉంటాయి. రూ.100 నోటును పరిశీలిస్తే దానికి రెండువైపులా నాలుగు లైన్లు కనిపిస్తున్నాయి. రెండు వందల నోట్లకు కూడా నాలుగు లైన్లు ఉంటాయి. కానీ దానితో పాటు దానికి రెండు సున్నాలు కూడా ఉన్నాయి. ఐదు వందల నోట్లలో ఐదు లైన్లు, రెండు వేల నోట్లపై ఏడు లైన్లు కనిపిస్తాయి. తద్వారా అంధులు వాటిని అనుభవించి నోటు విలువను అర్థం చేసుకోవచ్చు.
ALso Read: iPhone 12 Mini Flipkart: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.20 వేలకే iPhone 12 Mini!
Also Read: Boat 175 Airdopes Launch: వాటర్ ప్రూఫ్ ఇయర్ బడ్స్.. 35 గంటలు నాన్ స్టాప్ వర్కింగ్ తో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook