Kotak bank Account: మీరు ఉద్యోగస్థులైతే కోటక్ మహీంద్రా బ్యాంకు నుంచి గుడ్‌న్యూస్. మీకోసం కోటక్ మహీంద్ర బ్యాంకు ప్రత్యేక బ్యాంక్ ఎక్కౌంట్ అందిస్తోంది. ఆ ఎక్కౌంట్ లాభాలేంటో చూద్దాం..
ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. మీరు ప్రభుత్వ ఉద్యోగులైతే బ్యాంకు మీకు భారీ ప్రయోజనాలు చేకూర్చనుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ ఈ ఆఫర్ ద్వారా చాలా లాభాలు అందిస్తోంది. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగులైతే కోటక్ నేషన్ బిల్డర్స్ పేరుతో పథకమిది. ఈ పధకంలో శాలరీ ఎక్కౌంట్ తెరవడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. ఎందుకంటే ఈ ఎక్కౌంట్ కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసమే. ఈ ఎక్కౌంట్ లాభాల్ని ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేట్ రంగంలోని వేతన జీవులు కూడా పొందవచ్చు.
ఒకవేళ మీరు వేతన జీవులైతే కోటక్ మహీంద్రా బ్యాంక్ శాలరీ ఎక్కౌంట్ లాభం పొందాలనుకుంటే..ఏం చేయాలో తెలుసుకుందాం..కోటక్ నేషన్ బిల్డర్స్ కింద ప్రభుత్వ సిబ్బంది తమ ఎక్కౌంట్ ఓపెన్ చేయాలి. ఇందులో మీకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉచితంగా లాకర్ ఫెసిలిటీ లభ్యమవుతుంది. ఇందులో ఒక నెలలో 2 లక్షల రూపాయలు ఉచిత నగదు డిపాజిట్, నెలలో 30 లావాదేవీలు ఉచితంగా ఉంటాయి. ఇందులో 50 లక్షల రూపాయల ప్రమాద భీమా వర్తిస్తుంది. ప్రమాదంలో వైకల్యం పొందితే 30 లక్షల రూపాయలు భీమా లభిస్తుంది.
ఈ పధకం కింద రూపే ప్లాటినం డెబిట్ కార్డు అందుతుంది. ఇందులో ఉచిత ఆన్ డెబిట్ కార్డు యాడ్ చేయవచ్చు. ఈ కార్డు వినియోగిస్తే..చాలా బ్రాండ్స్‌పై 5 శాతం వరకూ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ కార్డు పై 4 దేశీయ, 2 విదేశీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ సౌకర్యం లభిస్తుంది.
Also read: Jio Prepaid Tariffs: జియో యూజర్లకు షాక్, భారీగా పెరిగిన ప్రీ పెయిడ్ ధరలు
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook