Philips Layoffs 2023: దిగ్గజ కంపెనీలు వరుసగా ఉద్యోగుల తొలగింపు ప్రకటనలు చేస్తున్నాయి. కంపెనీపై అదనపు భారాన్ని తొలగించుకుని.. నష్టాల నుంచి గట్టేక్కేందుకు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫిలిప్స్ కంపెనీ నుంచి 6 వేల మంది ఉద్యోగులను సాగనంపనున్నారు. ఈ విషయాన్ని ఆ కంపెనీ కూడా ప్రకటించింది. లోపభూయిష్ట స్లీప్ రెస్పిరేటర్లను భారీగా రీకాల్ చేయడం వల్ల గణనీయమైన నష్టాన్ని కలిగించిందని.. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఫిలిప్స్ కంపెనీ వెల్లడించింది. మూడు నెలల క్రితం 4 వేల ఉద్యోగాలు తొలంచగా.. తాజాగా మరో 6 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
ఫిలిప్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయ్ జాకబ్స్ మాట్లాడుతూ.. 2025 సంవత్సరం నాటికి తమ ఉద్యోగుల సంఖ్య మరింత తగ్గుతుందని అన్నారు. ఫిలిప్స్, తమ వాటాదారులకు 2022 చాలా కష్టతరమైన సంవత్సరం అని అన్నారు. తమ తక్షణ పనితీరును మెరుగుపరచడానికి బలమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎక్కువగా రీకాల్ కారణంగా ఆమ్‌స్టర్‌డామ్ ఆధారిత సంస్థ 2022 నాల్గో త్రైమాసికంలో 105 మిలియన్ యూరోల ($114 మిలియన్లు) నికర నష్టాన్ని చవిచూసింది. అంతకుముందు సంవత్సరానికి 1.6 బిలియన్ యూరోల నికర నష్టం వచ్చింది. ఫిలిప్స్ 2021లో స్లీప్ అప్నియాతో బాధపడుతున్న వ్యక్తుల చికిత్స కోసం తన పరికరాలను గ్లోబల్ రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పనితీరును మెరుగుపరచడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి తాము పని చేసే విధానాన్ని ఫిలిప్స్ సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని జాకబ్స్ చెప్పారు. ఇందులో 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందన్నారు.
2023లో మొత్తం 3 వేల కొత్త ఉద్యోగాలు తొలగించనున్నారు. కంపెనీ ఇప్పుడు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విచారణలో ఉంది. తమ రోగి భద్రత, నాణ్యత నిర్వహణను బలోపేతం చేయడం, రెస్పిరోనిక్స్ రీకాల్‌ను పూర్తి చేయడంపై ఫిలిప్స్ దృష్టి సారిస్తుందని జాకబ్స్ చెప్పారు. రోగులు కొనుగోలు చేయాల్సిన రీప్లేస్‌మెంట్ ఎక్విప్‌మెంట్‌లో 90 శాతం కంపెనీ ఉత్పత్తి చేసిందని వెల్లడించారు. డిసెంబరులో ముందుగా రీకాల్ చేసిన రెస్పిరేటర్‌లపై చేసిన పరీక్షలు అవి ఉపయోగం కోసం భద్రతా పరిమితుల్లో ఉన్నాయని చూపించాయన్నారు. అయితే తుది నిర్ణయం నియంత్రణ అధికారులదేనని నివేదించారు.
Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. బడ్జెట్‌లో కేంద్రం భారీ ప్రకటన..?
Also Read: Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ బాల్.. బ్యాట్స్‌మెన్ దిమ్మతిరిగింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook