LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రైవేటైజేషన్‌కు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అధికశాతం వాటాల్ని విక్రయించనుంది. ఇందులో భాగంగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూలో పాలసీదారులకు పదిశాతం షేర్లు కేటాయించనున్నట్టు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఎల్ఐసీ పాలసీదారుల ( Lic policy holders )కు కేంద్ర ప్రభుత్వం ( Central government ) శుభవార్త విన్పిస్తోంది. అవసరమైన పాలసీదార్లకు ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యు ( Lic public issue )లో పదిశాతం షేర్లను కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. పాలసీదార్లు ప్రయోజనాల్ని కాపాడే క్రమంలో ఎల్ఐసీలో ప్రభుత్వం మెజార్టీ వాటాదారుగా కొనసాగుతుందని చెప్పారు. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అనురాగ్ ఠాగూర్ ( Anurag thakur ) ఈ విషయాలు తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఎల్ఐసీని స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ చేయనున్నట్టు అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
ఎల్ఐసీ ( LIC ) విలువను మదింపు చేసేందుకు యాక్టువేరియల్ సంస్థ మిల్లీమన్ అడ్వైజర్స్‌ను కేంద్ర పెట్టబడులు, ప్రభుత్వ ఆస్థుల నిర్వహణ విభాగం ఎంపిక చేసింది. ప్రీ ఐపీవో లావాదేవీలకు సంబంధించి సలహాదారులుగా డెలాయిట్, ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించింది. ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా 2021-22 సంవత్సరానికి 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్ధయించింది.
Also read: Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్‌లో రికార్డు ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook