Samsung Smart Watches: శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ శాంసంగ్ గెలాక్సీ, అల్ట్రా లాంచ్ త్వరలో, ధర, ఫీచర్లు

Samsung Smart Watches: స్మార్ట్‌ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్ తయారీలో Samsung స్థానం ప్రత్యేకం. స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్‌వాచ్‌లకు కూడా మార్కెట్‌లో క్రేజ్ ఎక్కువ. త్వరలో శాంసంగ్ నుంచి మరో లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ లాంచ్ కానుంది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 18, 2024, 12:03 PM IST
Samsung Smart Watches: శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ శాంసంగ్ గెలాక్సీ, అల్ట్రా లాంచ్ త్వరలో, ధర, ఫీచర్లు

Samsung Smart Watches: Samsung నుంచి వచ్చే నెల జూలైలో అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహించనుంది. Samsung Galaxy 7, Samsung Galaxy Ultraతో పాటు ఇతర స్మార్ట్ ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. శాంసంగ్ లాంచ్ చేయనున్న ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం.

శాంసంగ్ నుంచి జూలైలో లేటెస్ట్ స్మార్ట్ ఉత్పత్తులు విడుదల కానున్నాయి. Samsung Galaxy 7, Samsung Galaxy Ultra స్మార్ట్‌వాచ్‌లతో పాటు ఫోల్డెడ్ ఫోన్లలో Samsung Galaxy Z Fold 6, Samsung Galazy Z Flip 6, ఇతర గ్యాడ్జెట్స్‌‌లో Samsung Galazy Ring, Samsung Galazy Buds 3 అందుబాటులో రానున్నాయి. ఇందులో శాంసంగ్ గెలాక్సీ 7 స్మార్ట్‌వాచ్ ఫీచర్లు లీకయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ 7 అనేది 40 ఎంఎం, 44 ఎంఎం సైజుల్లో లభించనుంది. ఈ వాచ్ 3 ఎన్ఎం ఎక్సినోస్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 300-425 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉండవచ్చు. వివిధ న్యూస్ ఏజెన్సీల సమాచారం ప్రకారం శాంసంగ్ గెలాక్సీ 7 స్మార్ట్‌వాచ్ ధర 25-26 వేలుండవచ్చు. ఇందులో మార్బుల్ గ్రే, క్రీమ్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో లభిస్తోంది. ఇక శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా అయితే 58,400 రూపాయల్నించి 59,300 రూపాయలుండవచ్చు. ఈ వాచ్ టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్ గత వారమే గెలాక్సీ స్మార్ట్ వాచ్ ఎఫ్ఇను లాంచ్ చేసింది. ఇది 1.2 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. డ్యూయల్ కోర్ ఎక్సినోస్ W920 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్కతుంది. వేర్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 1.5 జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఉన్నాయి. అంతేకాకుండా హెల్త్ ట్రాక్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా హార్ట్ రేట్, బ్లడ్ ప్రషెర్, క్వాలిటీ స్లీప్, పల్స్ రేట్‌లో తేడాలు ఇలా చాలా ఫీచర్లు ఉన్నాయి. 40 ఎన్ఎం పరిమాణంలో బ్లాక్, పింక్, గోల్డ్, సిల్వర్ రంగులున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌ఇ సఫైర్ అయితే క్రిస్టల్ గ్లాస్ రంగులో లభ్యమౌతోంది. ఇందులో స్మార్ట్‌వాచ్ కెమేరాను నియంత్రించే ఫీచర్ కూడా ఉంటుంది. ఈ వాచ్ కేవలం 26.6 గ్రాముల బరువుంటుంది. 

Also read: Tata Nexon Offers: టాటా నెక్సాన్ కార్లపై 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News