Facebook Layoffs: మెటా సంచలన నిర్ణయం.. 10 వేల ఉద్యోగాలు తొలగింపు..!

Meta Layoffs 2023: మెటా ఉద్యోగుల తొలగింపుపై కీలక అప్‌డేట్ వచ్చింది. గతేడాది 11 వేల మంది ఉద్యోగుల తొలగింపు తరువాత మరో 10 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఐదు వేల ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ను కూడా ఆపేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 08:52 PM IST
Facebook Layoffs: మెటా సంచలన నిర్ణయం.. 10 వేల ఉద్యోగాలు తొలగింపు..!

Meta Layoffs 2023: అనుకున్నదే జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఉద్యోగాలకు తొలగింపునకు సిద్ధమైంది. తమ ఉద్యోగులలో 10 వేల మందిని తొలగించబోతోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో మెటా 5 వేల ఓపెన్ జాబ్స్ ప్లాన్‌ను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. అంటే 10 వేల ఉద్యోగాలు పోవడమే కాకుండా.. 5 వేల రిక్రూట్‌మెంట్ ఆగిపోనుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డిజిటల్ సేకరణలతో మెటా.. ఉద్యోగాల భర్తీ నిలిపివేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్‌ఎఫ్‌టీలను సృష్టించడం, విక్రయించడంపై మెటా తన ట్రయల్స్‌ను నిలిపివేస్తుందని ది వెర్జ్‌లోని ఒక నివేదిక తెలిపింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్‌ఎఫ్‌టీలను పంచుకునే వినియోగదారుల సామర్థ్యం కూడా నిలిపివేయనుందని వెల్లడించింది. రీల్స్‌పై మెసేజింగ్, మానిటైజేషన్, మెటా పేకి మెరుగుదలు వంటి భారీ ప్రభావాన్ని చూపగల రంగాలపై మెటా దృష్టి సారిస్తుందని పేర్కొంది. ఆగస్ట్ 2022లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు ఎన్‌ఎఫ్‌టీ సపోర్ట్‌ను ప్రకటించింది. ఇటీవల యుఎస్‌లో ఉన్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్స్ కోసం రీల్స్ ప్లే బోనస్‌ను నిలిపివేసింది.

"మా టీమ్ పరిమాణంలో 10 వేల మంది తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. మేము ఇంకా నియమించుకోని 5 వేల మంది రిక్రూట్‌మెంట్‌ కూడా మూసివేయాలని మేము భావిస్తున్నాం" అని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఒకేసారి పది వేల మంది తొలగింపు ప్రకటనతో ఫేస్‌బుక్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

మెటా వర్క్‌ఫోర్స్‌ను తగ్గింపులో భాగంగా.. గతేడాది నవంబర్‌లో 11 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. గతంలో మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. తాము కంపెనీని కొంతవరకు మార్చామని భావిస్తున్నామని.. దాదాపు రెండు దశాబ్దాలుగా గ్లోబల్ వర్క్‌ఫోర్స్ స్థిరంగా వృద్ధి చెందిందని అన్నారు. దీనివల్ల నిజంగా సమర్థతను పెంచుకోవడం చాలా కష్టమన్నారు.

నాన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వారు మొదట తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మెటా ప్లాట్‌ఫారమ్‌లు రాబోయే నెలల్లో అదనపు తొలగింపులను ప్రకటించాలని యోచిస్తున్నట్లు నివేదికల్లు పేర్కొంటున్నాయి. ఈ లేఆఫ్‌లతో కంపెనీ కొన్ని ప్రాజెక్ట్‌లు, టీమ్‌లను కూడా మూసివేస్తుందని చెబుతున్నాయి. ఈ లే ఆఫ్స్‌తో మెటా, హార్డ్‌వేర్, మెటావర్స్ వర్టికల్స్‌తో పాటు ప్రస్తుతం బిలియన్ డాలర్ల బడ్జెట్‌లను కలిగి ఉన్న రియాలిటీ ల్యాబ్‌లలోని ప్రాజెక్ట్‌లను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది.

Also Read: TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు.. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్..?

Also Read: Viral Video: డబ్బుల వర్షం.. నోట్ల కట్లను రోడ్డుపైకి విసిరేశాడు.. వీడియో చూస్తే షాక్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News