Corona crisis period: కరోనా సంక్షోభ సమయంలో భారీగా కొత్త కంపెనీలు

Corona crisis period: సంక్షోభం అవకాశాల్ని సృష్టిస్తుంది. కష్టాలుంటేనే పరిష్కారం కన్పిస్తుంది. అదే జరిగింది కరోనా సంక్షోభ సమయంలో. కరోనా వైరస్ మహమ్మారి దేశ ఆర్ధిక వ్యవస్థకు నష్టం కల్గించడమే కాకుండా కొత్త అవకాశాల్ని చూపించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2021, 09:59 PM IST
Corona crisis period: కరోనా సంక్షోభ సమయంలో భారీగా కొత్త కంపెనీలు

Corona crisis period: సంక్షోభం అవకాశాల్ని సృష్టిస్తుంది. కష్టాలుంటేనే పరిష్కారం కన్పిస్తుంది. అదే జరిగింది కరోనా సంక్షోభ సమయంలో. కరోనా వైరస్ మహమ్మారి దేశ ఆర్ధిక వ్యవస్థకు నష్టం కల్గించడమే కాకుండా కొత్త అవకాశాల్ని చూపించింది.

కరోనా సంక్షోభ సమయం(Corona crisis period). 2020 మార్చ్ నుంచి మొన్నటి వరకూ. అంటే అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానంతవరకూ. దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పట్టాలు తప్పిన ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. అదే సమయంలో సంక్షోభం కొత్త అవకాశాలకు పుట్టుకనిస్తుందని మరోసారి నిరూపితమైంది. కరోనా సంక్షోభ సమయంలో పడిన కష్టాల్నించి కొత్త పరిష్కారమార్గాలు ఆవిష్కృతమయ్యాయి. కరోనా సమయంలో కంపెనీలు మూతపడినా..కొత్త కంపెనీల జోరు మాత్రం కొనసాగింది. సాక్షాత్తూ కేంద్ర మంత్రిత్వ శాఖే ఈ విషయాన్ని వెల్లడించింది.

2020 ఏప్రిల్ నుంచి 2021 ఫిబ్రవరి వరకూ 1 లక్షా 38 వేల 51 కొత్త కంపెనీలు నమోదయ్యాయని కేంద్ర ఆర్ధిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్( Anurag Thakur) తెలిపారు. అదే సమయంలో 10  వేల 113 కంపెనీలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయన్నారు. అంటే కొత్త కంపెనీల జోరు కరోనా సమయంలో పూర్తిగా కొనసాగింది. లోక్‌సభలో ( Loksabha) కంపెనీల చట్టం 2013 ప్రకారం ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి లిఖితపూర్వకంగా తెలిపారు. ప్రజా తనిఖీ నిమిత్తం ఇవే వివరాల్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన వెబ్‌సైట్‌లో లభిస్తాయన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయం గత ఆరేళ్లలో 3 వందల శాతం పెరిగిందన్నారు. 

Also read: Covishield vaccine: కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెరిగింది..గమనించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News