Passport Re Issue: మీ పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయిందా..కొత్తది ఇలా రీ ఇష్యూ చేసుకోవచ్చు

Passport Re Issue: పాస్‌పోర్ట్ నిబంధలు కొత్తగా జారీ అయ్యాయి. మీ పాస్‌పోర్ట్ పాడైనా లేదా పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్తది జారీ చేస్తారు. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 19, 2022, 04:07 PM IST
Passport Re Issue: మీ పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయిందా..కొత్తది ఇలా రీ ఇష్యూ చేసుకోవచ్చు

Passport Re Issue: పాస్‌పోర్ట్ నిబంధలు కొత్తగా జారీ అయ్యాయి. మీ పాస్‌పోర్ట్ పాడైనా లేదా పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్తది జారీ చేస్తారు. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి.

పాస్‌పోర్ట్ అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్. అన్ని రకాల దర్యాప్తుల తరువాతే కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. అలాంటి పాస్‌పోర్ట్ ఎవరికైనా చిక్కితే దుర్వినియోగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ క్రమంలో పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయితే కొందరు చాలా కంగారు పడుతుంటారు. అయితే చింతించాల్సిన అవసరం లేదు. మీ పాస్‌పార్ట్ చిరిగినా లేదా డ్యామేజ్ అయినా కొత్తది రీ ఇష్యూ అవుతుంది. పాస్‌పోర్ట్ రీ ఇష్యూ విషయంలో నిబంధనలు ఇలా ఉన్నాయి. 

పాస్‌పోర్ట్ రీ ఇష్యూ కోసం ముందుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసులో స్లాట్ బుక్ చేసుకోవాలి. అక్కడ మీ వివరాలు, అవసరమైన కాగితాలు చెక్ చేస్తారు. అన్ని వివరాలు చెక్ చేసిన తరువాత 3 రోజుల్నించి 1 వారంలోగా కొత్త పాస్‌పోర్ట్ రీ ఇష్యూ అవుతుంది. మీ పాస్‌పోర్ట్ డ్యామేజ్ కారణంగా కొత్తది రీ ఇష్యూ చేయించాలనుకుంటే..దాదాపు 3 వేల వరకూ ఖర్చవుతుంది. 

ఒకవేళ మీ పాస్‌పోర్ట్ పోయినా సరే కంగారు పడాల్సిన అవసరం లేదు. కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవచ్చు. దీనికోసం మూడు దశలుంటాయి.. ముందుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. ఆ సమాచారాన్ని పాస్‌పోర్ట్ ఆఫీసు, ఎంబసీకు అందించాలి. ఆ తరవాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ రీ ఇష్యూ కోసం దరఖాస్తు చేయాలి. దీనికోసం అప్లికేషన్ ఒకటి ఫిల్ చేయాల్సి వస్తుంది. అవసరమైన కాగితాలు సమర్పించాలి. అన్ని వివరాలు చెక్ చేసిన తరువాత 10 రోజుల్లో కొత్త పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. 

Also read: Selling Old Coin: మీవద్ద 50 పైసల నాణెం ఉందా... అయితే సులువుగా రూ.1 లక్ష పొందే ఛాన్స్.. ఎలాగో తెలుసా..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News