Credit Guarantee Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్‌ గురించి తెలుసా..!

Livestock Sector: పీఎం కిసాన్ నిధులు ఈ నెల 28వ తేదీన లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈలోపు రైతులకు మరో శుభవార్త చెప్పింది. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2023, 01:57 PM IST
Credit Guarantee Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్‌ గురించి తెలుసా..!

Livestock Sector: అన్నదాతలకు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న విషయం తెలసిందే. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏటా రూ.6 వేలను జమ చేస్తోంది. వాయిదాకు రూ.2 వేల చొప్పున ఏడాదికి మూడు విడతల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది. 14వ విడతకు సంబంధించిన నిధులను జూలై 28న రైతుల అకౌంట్‌లలోకి ప్రభుత్వం జమ చేయనుంది. ఈ స్కీమ్‌ మాత్రమే కాకుండా ప్రధానమంత్రి కిసాన్ ఫసల్ యోజన, పీఎం మంధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా కూడా ఆర్థికంగా సహాకారం అందజేస్తోంది. 

తాజాగా మరో రుణ హామీ స్కీమ్‌ను  అమలు చేస్తోంది. పశుసంవర్ధక రంగంలో ఉన్న ఎంఎస్‌ఎఈలకు నిధులను విడుదల చేయనుంది. పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

లోన్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం.. పశుసంవర్ధక రంగంలో నిమగ్నమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి గ్యారంటీ లేకుండా నిధులను అందజేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ నిర్వహణకు కేంద్ర ప్రబుత్వం రూ.750 కోట్లతో క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఇది అర్హత కలిగిన లోన్ కంపెనీలు ఎంఎస్‌ఎంఈలులకు విస్తరించిన క్రెడిట్ సౌకర్యాలలో 25 శాతం వరకు క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని అందిస్తుంది.

క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ కు అర్హత లేని.. తక్కువ సేవలందిస్తున్న పశువుల రంగానికి ఫైనాన్స్ యాక్సెస్‌ను ఈజీగా అందజేస్తుంది. ఏఐహెచ్‌డీఎఫ్‌ పథకం కింద మూడు శాతం వడ్డీ రాయితీ, ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) నుంచి మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం వరకు లోన్ పొందే అవకాశం కల్పిస్తోంది.

Also Read: Whatsapp Latest Update: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వీడియో కాల్ లిమిట్ పెంపు  

Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News