Post office Schemes: నెలకు 15 వందల పొదుపు చేయండి చాలు..మెచ్యూరిటీ అనంతరం 35 లక్షలు

Post office Schemes: కష్టపడి సంపాదించించి ఏదైనా సురక్షిత మార్గంలో పెట్టుబడి పెడితే భవిష్యత్ బాగుంటుంది. రిటైర్మెంట్ అనంతర జీవితానికి ఓ రక్షణ ఉంటుంది. అంత సురక్షితమైన బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఏమున్నాయో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 15, 2023, 12:08 PM IST
Post office Schemes: నెలకు 15 వందల పొదుపు చేయండి చాలు..మెచ్యూరిటీ అనంతరం 35 లక్షలు

భవిష్యత్ సురక్షితం చేసుకునేందుకు పోస్టాఫీసు పథకాలు మంచి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. బ్యాంకులతో పోలిస్తే ఇవే బెస్ట్ అంటారు మార్కెట్ నిపుణులు. ప్రభుత్వ హామీతో పాటు వడ్డీ రేటు ఎక్కువ కావడమే దీనికి కారణం. ఆ వివరాలు మీ కోసం.. 

పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉన్న వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా పోస్టాఫీసు పధకాలంటే ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవని అర్ధం. అంటే పూర్తిగా సురక్షితం. మీరు పోస్ట్ ఆఫీసులో ఎక్కౌంట్ ఓపెన్ చేసుకునుంటే..లేదా ఏదైనా స్కీమ్ కోసం ఆలోచిస్తుంటే పోస్టాఫీసులో అద్భుతమైన పథకాలున్నాయి. ఇందులో ఏకంగా 35 లక్షలు లాభాల్ని ఆర్జించవచ్చు. ఆశ్యర్చపోవద్దు..నిజమే..

15 వందల పెట్టుబడితో అద్భుత లాభాలు

పోస్టాఫీసు పధకాల్లో ఇది మంచి పధకం. పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన పథకమిది. ఇందులో మీ డబ్బుకు పూర్తిగా గ్యారంటీ ఉంటుంది. ఇందులో పెద్దఎత్తున లాభాలున్నాయి. పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన అనేది ఓ రకమైన భీమా పధకం. ఇందులో మీరు నెలకు కేవలం 15 వందల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఫలితంగా మీకు 35 లక్షల రూపాయలు లభిస్తాయి.

అర్హత ఎలా

పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన పథకాన్ని 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకూ ఎవరైనా ఈ స్కీమ్ ప్రారంభించవచ్చు. ఈ పధకంలో కనీస భీమా మొత్తం 10 వేల రూపాయలు. అది కాకుండా అత్యధికంగా 10 లక్షల రూపాయలుంది. ఈ పధకంలో ప్రీమియం మొత్తాన్ని నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లింపు కోసం 30 రోజుల వ్యవధి కూడా ఉంటుంది. ఈ పథకంలో మీకు రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ఇది కాకుండా లోన్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. పాలసీ తీసుకున్న 4 ఏళ్ల తరువాతే లోన్ తీసుకునే సౌకర్యం పొందవచ్చు.

ఒకవేళ 19 ఏళ్ల వయస్సులో పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటే..55 ఏళ్ల కోసం నెలవారీ ప్రీమియం 1515 రూపాయలు కాగా 58 ఏళ్లకైతే 1463 రూపాయలు, 60 ఏళ్లకైతే 1411 రూపాయలుంటుంది. 

ఇందులోనే 55 ఏళ్ల ప్లాన్ ప్రకారం అయితే 31.60 లక్షల రూపాయలు మెచ్యూరిటీ బెనిఫిట్ లభిస్తుంది. 58 ఏళ్లకైతే 33.40 లక్షల రూపాయలు మెచ్యూరిటీ వస్తుంది. అదే 60 ఏళ్లకైతే 34.60 లక్షల రూపాయలు మెచ్యూరిటీ ఫండ్ లభిస్తుంది. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ఈ పాలసీని మధ్యలో సరెండర్ కూడా చేయవచ్చు. అయితే కనీసం మూడేళ్ల తరువాతే సరెండర్ చేసే అవకాశం ఉంటుంది. 

Also read: Kia EV9: కియా ఈవీ9 చూస్తే చిన్న సైజ్ ఫ్లాట్ అనుకుంటారేమో, ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News