Kisan Vikas Patra: దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే కిసాన్ వికాస్ పత్ర అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌గా చెప్పవచ్చు. ఇందులో పెట్టిన పెట్టుబడికి రిస్క్ ఏ మాత్రం ఉండదు. రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ. మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ట్యాక్స్స మినహాయింపు కూడా లభిస్తుంది.
ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ చాలా ఉంటాయి. కానీ కొన్నింటిలో లాభాలతో పాటు రిస్క్ కూడా ఉంటుంది. కొందరు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడవచ్చు. మరికొందరు రిస్క్ లేని పధకాల కోసం చూస్తుంటారు. రిస్క్ లేకుండా రిటర్న్స్ ఎక్కువగా అందించే ఇన్వెస్ట్‌మెంట్ పథకాలు చాలా ఉన్నాయి. అలాంటిదే పోస్టాఫీసులు అందించే కిసాన్ వికాస్ పత్ర పధకం. ఈ పథకంలో పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది.
కిసాన్ వికాస్ పత్ర పధకంలో పెట్టిన పెట్టుబడికి గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. పెట్టిన పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం ఈ పధకంపై ఏడాదికి 7.5 శాతం వడ్డీ అందుతోంది. ఈ పధకంలో 1000 రూపాయల్నించి మీ పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్ని ఎక్కౌంట్లయినా ఓపెన్ చేయవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర కేవలం రైతులకు మాత్రమే అని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి 1988లో ప్రారంభించిన ఈ పధకం ఉద్దేశ్యం అదే. రైతుల కోసమే ప్రారంభించారు. కానీ కాలక్రమంలో అందరికీ వర్తింపజేశారు. మేజర్ అయిన ఎవరైనా సరే సింగిల్ లేదా జాయింట్ ఎక్కౌంట్‌గా ఈ పధకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. పిల్లలు కూడా పదేళ్ల వయస్సు దాటితే తమపేరుపై తీసుకోవచ్చు. అయితే గార్డియన్ ఉండాలి. ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, కేవీపీ దరఖాస్తు అవసరమౌతాయి.
ఒకవేళ 115 నెలల కంటే ముందే విత్ డ్రా చేయాలనుకుంటే అంటే ప్రీ మెచ్యూర్ విత్ డ్రాయల్ నిబంధనలు కొన్ని వర్తిస్తాయి. 2 ఏళ్ల 6 నెలల తరువాత విత్ డ్రా చేసుకోవచ్చు. అలాకాకుండా ఎక్కౌంట్ హోల్డర్ మరణించినా, కోర్టు ఆదేశాలున్నా, ఆస్థుల తనఖా సందర్భాల్లో విత్ డ్రా చేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook