FD Rate Hike: ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా పెంపు

Fixed Deposit Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. 300 రోజుల టేనర్‌పై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపునకు రేట్లను సంబంధించి వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2024, 08:53 PM IST
FD Rate Hike: ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా పెంపు

PNB Fixed Deposit Rates: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త ఎఫ్‌డీ రేట్లు జనవరి 8వ తేదీ నుంచి వర్తిస్తాయని పంజాబ్ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 300 రోజుల టేనర్‌పై ఎఫ్‌డీ రేట్లు సాధారణ ప్రజలకు  గతంలో 6.25 శాతం ఉండగా.. 7.05 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్‌లకు రేటు 7.55 శాతానికి, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.85 శాతానికి పెంచింది. 271 రోజుల నుంచి ఒక సంవత్సరం, 400 రోజుల కాలవ్యవధిపై రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటును 45 బేసిస్ పాయింట్లు పెంచింది. 400 రోజుల కాలవ్యవధి కోసం రూ.కోటి నుంచి 2 కోట్ల మధ్య డిపాజిట్లపై కూడా బ్యాంక్ ఎఫ్‌డీ రేటును అదేస్థాయిలో పెంచింది.

ఈ పెంపు తర్వాత సాధారణ డిపాజిటర్లకు ఎఫ్‌డీ రేటు పరిధి ఇప్పుడు 3.50-7.25 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు 4 నుంచి 7.75 శాతం పరిధిలో ఎఫ్‌డీ రేటు ఆప్షన్లు ఉన్నాయి. సూపర్ సీనియర్ సిటిజన్లు 4.30-8.05 శాతం రేటు పెంపును పొందవచ్చు. అంతకుముందు 444 రోజుల ఎఫ్‌డీపై 45 bps తగ్గించగా.. 6.80 శాతానికి చేరుకుంది.

ఇటీవల బ్యాంకుల ఎఫ్‌డీ రేట్లు సవరింపు ఇలా..

==> IDFC బ్యాంక్ అన్ని కాల వ్యవధిలో FD రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది
==> బజాజ్ ఫైనాన్స్ 42 నెలల డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై FD రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది
==> బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్ ఆఫర్‌ను మార్చి 31, 2024 వరకు 375 రోజులు, 444 రోజుల కాలవ్యవధికి పొడిగించింది. అంతేకాకుండా రూ.2 కోట్ల కంటే ఎక్కువ రూ.50 కోట్ల డిపాజిట్ల కోసం 7.5 శాతం వడ్డీ రేటుతో సూపర్ స్పెషల్ ఎఫ్‌డీ పథకాన్ని ప్రవేశపెట్టింది.
==> బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వివిధ కాల వ్యవధిలో FD రేట్లను 25-300 బేసిస్ పాయింట్లు పెంచింది. 25-125 bps పరిధిలో ఇతరులపై రేట్లను తగ్గించింది. జనవరి 1, 2024 నుంచి అమలులోకి వచ్చింది. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News