Rail Vikas Nigam Ltd Share Price: ప్రతి రోజూ షేర్ మార్కెట్ హెచ్చు తగ్గులతో క్లోజ్ అవుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే పెట్టుబడులు పెట్టడానికి ఏది మంచిదని నిత్యం సోషల్ మీడియా వేదికల ద్వారా తెలుసుకుంటారు. అయితే ఈ రోజు మనం రైల్ వికాస్ నిగమ్‌కి సంబంధించిన షేర్ గురించి తెలుసుకుందాం. ఇటీవలే రైల్ వికాస్ నిగమ్ గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్ పోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు Rail Vikas Nigam Ltd సంబంధించిన షేర్ ప్రైజ్ పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ప్రారంభ ట్రేడింగ్‌లో రూ.76.20 నుంచి ఉన్న షేర్ ధర రూ.78.10 రేంజ్‌లో ట్రేడవుతోంది. గతేడాది ఈ స్టాక్ బంపర్ రిటర్న్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే..
రైలు వికాస్ నిగమ్ ఫాస్ట్ ట్రాక్:
రైల్ వికాస్ నిగమ్ స్టాక్ ఈ ఏడాది ఇప్పటివరకు 13 శాతానికి పైగా రాబడిని ఇచ్చిందని నిపుణులు తెలుపుతున్నారు. నిన్న ఈ షేర్ ప్రైజ్ తగ్గినప్పటికీ ఈ స్టాక్ తిరిగి బుల్లిష్ ట్రాక్‌లోకి వచ్చింది. ఇది ఈరోజు NSEలో రూ.76.50 వద్ద ప్రారంభం కాగా.. గరిష్టంగా రూ.78.10కి చేరుకుంది. NSEలో ఉదయం 10:14 గంటలకు మొత్తం 1219089 షేర్లు కొనుగోళ్ల చేయగా.. 1222086 అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ షేర్ విలువ భవిష్యత్‌లో పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ షేర్ పెరిగితే ఎంత మొత్తంలో పెరుగుతుందో ఇతర వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Rail Vikas Nigam Ltd షేర్ ధర:
గత 3 నెలల్లో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించిన రైల్ వికాస్ నిగమ్(Rail Vikas Nigam Ltd ) షేర్లు.. ఈ సంవత్సరం 2023లో మల్టీబ్యాగర్‌గా మారవచ్చని నిపుణుల అభిప్రాయం. మూడు నెలల్లో ఈ స్టాక్ రూ.36.10 నుంచి రూ.77.85కి చేరుకోగా భవిష్యత్‌లో మరింత పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇది ఒక సంవత్సరంలోనే 108 శాతానికి పైగా రాబడిని ఇచ్చిన ఈ షేర్.. గత 5 సంవత్సరాలలో ఇది సుమారు 300 శాతం పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. IIFL సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. రైల్ వికాస్ నిగమ్ షేర్లు 2023లో మల్టీబ్యాగర్‌గా మారవచ్చని.. RVNL షేర్ ధర వచ్చే ఏడాదిలో రూ. 130 స్థాయికి చేరుతుందని బ్రోకరేజ్ హౌస్ అంచనా వేస్తోంది.
Also read: Sunil Jailer Look : ఇదేం లుక్‌రా బాబోయ్.. రజినీకాంత్‌ను ఢీ కొట్టనున్న సునిల్
Also read: Sunil Jailer Look : ఇదేం లుక్‌రా బాబోయ్.. రజినీకాంత్‌ను ఢీ కొట్టనున్న సునిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook