Sunil Jailer Look : ఇదేం లుక్‌రా బాబోయ్.. రజినీకాంత్‌ను ఢీ కొట్టనున్న సునిల్

Rajinikanth Jailer Movie టాలీవుడ్‌లో సునిల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే సునిల్ మాత్రం అటు కమెడియన్‌గా, ఇటు హీరోగా, ఇంకో వైపు విలన్‌గా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్‌గానే ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 07:15 PM IST
  • రజినీకాంత్ జైలర్ అప్డేట్
  • భయపెట్టే లుక్కులో సునిల్
  • రజినీకాంత్‌కు పోటీగా టాలీవుడ్ ఆర్టిస్ట్
Sunil Jailer Look : ఇదేం లుక్‌రా బాబోయ్.. రజినీకాంత్‌ను ఢీ కొట్టనున్న సునిల్

Sunil Look From Jailer Movie టాలీవుడ్ కమెడియన్‌గా, హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అన్ని పాత్రల్లో మెప్పించాడు సునిల్. అయితే హీరోగా నిలదొక్కుకుందామని బాగానే ప్రయత్నించాడు. కానీ సునిల్‌కు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. హీరోగా ప్రయత్నించి చేతులు కాలిన తరువాత మళ్లీ కామెడీ రోల్స్ చేయడం ప్రారంభించాడు. కామెడీ రోల్స్ కూడా క్లిక్ అవ్వకపోవడంతో విలన్ రోల్స్‌కి కూడా ఓకే చెప్పేస్తున్నాడు.

ఈ క్రమంలోనే పుష్ప సినిమా మంగళం శ్రీను పాత్రలో మెప్పించాడు. భయంకరమైన విలన్‌గా సునిల్ పాన్ ఇండియన్ స్థాయిలో మెప్పించాడు. ఇప్పుడు రజినీకాంత్ సినిమాలోనూ విలన్‌గా నటిస్తున్నాడు. డాన్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో సునిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా సునిల్ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇందులో సునిల్ ఎలా కనిపించబోతోన్నాడనేది చూపించారు.

 

జైలర్ సినిమాకు సంబంధించి ఇది వరకు వచ్చిన అప్డేట్ అందరినీ మెప్పించింది. ఇందులో రజనీ కారెక్టర్‌ లుక్ ఎలా ఉండబోతోందో చూపించారు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆ లుక్‌ను రివీల్ చేయలేదు. ఇప్పుడు సునిల్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. సునిల్ ఈ జైలర్ సినిమాలో విలనీగా కనిపించబోతోన్నాడు. ఈ లుక్‌లో సునిల్ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు.

బీస్ట్ వంటి ఫెయిల్యూర్ తరువాత నెల్సన్ దిలీప్ కుమార్ మళ్లీ రజినీతో ఈ జైలర్ సినిమా తీస్తున్నాడు. మరి ఈ సినిమా హిట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి. డాన్ సినిమాతో నెల్సన్ పేరు కోలీవుడ్‌లో మార్మోగిపోయింది.

Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?

Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News