LED Inverter Bulb Price in India: దేశంలో రోజురోజూకు ఎండలు మండిపోతున్నాయి. అంతేకాకుండా కరెంట్ కోతలు ఎక్కువై పోయాయి. మీరు కూడాఈ రకమైన విద్యుత్ సమస్యను (Power issue)ఎదుర్కొంటున్నట్లయితే.. మీ కోసం అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. 200 రూపాయల లోపు ధర కలిగిన ఈ ఉత్పత్తి..మీ ఇంట్లో కరెంట్ పోయినా కొన్ని గంటలపాటు మీకు వెలుగునివ్వగలదు. అదేంటో చూద్దాం.
ఈ బల్బ్ కరెంటు లేకపోయినా పని చేస్తుంది
అన్నింటిలో మెుదటగా మనం RSCT 9W ఇన్వర్టర్ ఎల్ఈడీ బల్బ్ గురించి మాట్లాడుకుందాం. ఇది రిఛార్జబుల్ ఎల్ఈడీ ఇన్వర్టర్ బల్బ్. ఇది AC / DC బల్బ్ అని మీకు తెలియజేస్తున్నాం. 9 వాట్స్ పవర్ తో ఈ బల్బు తెలుపు రంగులో లభిస్తుంది. ఇది 220-240V బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది 2200mAh రిఛార్జుబుల్ బ్యాటరీని కలిగి ఉంది. దీనిని (LED Inverter Bulb) ఛార్జ్ చేయడానికి 6 నుంచి 8 గంటలు పడుతుంది. ఇంట్లో కరెంట్ పోతే ఇది 5 గంటలు పాటు విద్యుతును ఇస్తుంది. ప్లాస్టిక్ మరియు అల్యూమినియంతో తయారు చేయబడిన ఈ బల్బును ఎక్కడైనా ఉపయోగించవచ్చు. మీరు ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ అమెజాన్ (Amazon) నుండి కేవలం 179 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.
Also Read: Flipkart Offer: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. రూ.20 వేలు విలువ చేసే ఈ టీవీ కేవలం రూ.499కే...
మరో రకం
అదేవిధంగా ఇదే కోవలోకి చెందుతుంది బూస్ట్ 15W ఇన్వర్టర్ LED బల్బ్. అయితే దీని ధర రూ. 299. ఈ బల్బును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది కూడా మీరు ఎక్కడైనా ఉపయోగించగల AC/DC బల్బు. దీని స్పెషాలిటీ ఏంటంటే, అది దానంతట అదే ఛార్జ్ అవుతుంది మరియు లైట్ ఆఫ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఈ ఇన్వర్టర్ బల్బ్ పాలికార్బోనేట్తో తయారు చేయబడింది మరియు పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, దీనిని 4 గంటల పాటు ఉపయోగించవచ్చు. అనేక రంగులలో లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.