Paytm Share: అంచనాలకు భిన్నంగా భారీగా ముంచేసిన పేటీఎం షేర్

Paytm Share: పేటీఎం ఐపీవో భారీ అంచనాలతో గత ఏడాది లాంచ్ అయింది. పేటీఎం ధర ఆకాశాన్నంటుతుందనే అంచనాలు ఘోరంగా విఫలమయ్యాయి. పేటీఎం షేర్‌లో తిరోగమనమే కన్పిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 31, 2022, 06:15 PM IST
Paytm Share: అంచనాలకు భిన్నంగా భారీగా ముంచేసిన పేటీఎం షేర్

షేర్ మార్కెట్‌లో ఏ కంపెనీ ఐపీవో వచ్చినా ఇన్వెస్టర్లకు చాలా అంచనాలుంటాయి. ఐపీవోల్లో పెట్టుబడితో లాభాలు ఆర్జించాలని ఆశిస్తుంటారు. కానీ అన్ని కంపెనీ షేర్లలో అలా జరగదు. అంచనాలకు భిన్నంగా ఉంటుంటాయి.

మార్కెట్‌లో చాలా షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఏడాది క్రితం లాంచ్ అయిన ఐపీవోలు..ఇప్పటికీ తిరోగమనంలో కన్పిస్తున్నాయి. ఏడాది దాటినా షేర్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి కంపెనీ ఐపీవోల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు. అలాంటిదే పేటీఎం. 2022 ఏడాది పేటీఎం ఇన్వెస్టర్లకు భారీగా నష్టం వాటిల్లింది.

పేటీఎం

2021 నవంబర్‌లో పేటీఎం భారీ అంచనాలతో ఐపీవో లాంచ్ చేసింది. రానున్న రోజుల్లో పేటీఎం కంపెనీ షేర్..ఐపీవో ప్రైస్‌ను దాటి పోతుందని ఇన్వెస్టర్లు భావించారు. అయితే అలా జరగలేదు. పేటీఎం షేర్ క్రమంగా తగ్గుతూనే వచ్చింది. పేటీఎం షేర్ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉందనే చెప్పాలి. 

పేటీఎం షేర్ ధర

2022లో పేటీఎం షేర్‌లో భారీగా క్షీణత కన్పించింది. పేటీఎం షేర్ ఈ ఏడాది 60 శాతం కంటే ఎక్కువే పడిపోయింది. ఈ ఏడాది పేటీఎం షేర్ ధర 52 వారాల గరిష్టం ఎన్ఎస్ఈలో 1350 రూపాయలుండగా. అదే 52 వారాల కనిష్టం 438.35 రూపాయలకు చేరుకుంది. పేటీఎం షేర్ ధర డిసెంబర్ 31, 2021 నాటికి 1334.55 రూపాయలుండేది.

భారీగా నష్టం

పేటీఎం 2022 చివర్లో 803.85 రూపాయలు అంటే 60.23 శాతం క్షీణించింది. అంటే ఒక్కొక్క షేర్ ఏకంగా 530.70 రూపాయలు తగ్గిపోయింది. నవంబర్ 2021లో పేటీఎం ఐపీవో ఇష్యూ ధర 2150 రూపాయలుంది. లిస్టింగ్ 1950 రూపాయలకైంది. నవంబర్ 18,2021 న లిస్టింగ్ రోజే షేర్ ధర క్షీణించడం ప్రారంభమైంది. లిస్టింగ్ రోజు 1564 రూపాయలకు క్లోజ్ అయింది.

Also read: Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో కీలక సూచనలు జారీ చేసిన యూఐడీఏఐ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News