Stock Market today: స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. నేటి సెషన్లో (గురువారం) సూచీలు స్వల్ప లాభాలను (stocks closing bell) నమోదు చేశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 85 పాయింట్లు బలపడి 61,235 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 45 పాయింట్ల లాభంతో 18,257 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్లలో లాభాలు నమోదవడం వరుసగా ఇది ఐదో సెషన్. లోహ, ఫార్మా, ఆటో, ఐటీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
దేశాన్ని ఓ వైపు కొవిడ్ మూడో దేశ భయాలు వెంటాడుతున్నా.. స్టాక్ మార్కెట్లు మాత్రం ముందుకే దూసుకెళ్తుండటం విశేషం.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 61,348 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 60,949 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,272 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 18,163 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 20 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 10 కంపెనీలు డీలా పడ్డాయి.
టాటా స్టీల్ 6.40 శాతం, సన్‌ఫార్మా 3.53 శాతం, ఎల్&టీ 2.30 శాతం, ఎం&ఎం 1.66 శాతం, పవర్ గ్రిడ్ 1.49 శాతం లాభాలను గడించాయి.
విప్రో 6 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.47 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.81 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.55 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.46 శాతం నష్టపోయాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. థైవాన్, హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను నమోదు చేశాయి.
షాంఘై (చైనా), టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా) సూచీలు నష్టపోయాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ (Rupee Value today) రూ.73.87 వద్ద కొనసాగుతోంది.
Also read: Tecno Pop 5 LTE: జియో స్మార్ట్ ఫోన్ కు పోటీగా భారత మార్కెట్లోకి Tecno మొబైల్స్ కొత్త వేరియంట్
Also read: Amazon New Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్‌డే సేల్ డేట్ వచ్చేసింది- పూర్తి వివరాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook