Tata Nexon Offers: టాటా నెక్సాన్ కార్లపై 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ ఆఫర్

Tata Nexon Offers: దేశంలో ఇటీవల ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లతో పోలిస్తే కంఫర్ట్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అత్యధిక ఆదరణ పొందుతున్న ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 16, 2024, 05:12 PM IST
Tata Nexon Offers: టాటా నెక్సాన్ కార్లపై 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ ఆఫర్

Tata Nexon Offers: మీకు టాటా నెక్సాన్ కారు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. టాటా నెక్సాన్ కార్లపై కంపెనీ భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. టాటా నెక్సాన్‌కు చెందిన ఒక్కో వేరియంట్‌పై ఒక్కోరకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. 

టాటా నెక్సాన్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా టాటా మోటార్స్ కంపెనీ వేరియంట్లపై ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. జూన్ 15 అంటే నిన్నటి నుంచి ఈ ఆఫర్ ప్రారంభమైంది. జూన్ 30 వరకూ అందుబాటులో ఉంటుంది. ఏకంగా లక్ష రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్ యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. ఇప్పటి వరకూ టాటా నెక్సాన్  7 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అయితే గత రెండు నెలల్లో టాటా కార్ల విక్రయాలు తగ్గిపోయాయి. దాంతో సేల్స్ పెంచుకునేందుకు టాటా నెక్సాన్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ పై గరిష్టంగా 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. 

టాటా నెక్సాన్ స్మార్ట్ వేరియంట్ పై 16 వేలు, స్మార్ట్ పెట్రోల్ వేరియంట్ పై 20 వేలు, స్మార్ట్ ప్లస్ ఎస్ వేరియంట్ పై 40 వేలు, పెట్రోల్ వేరియంట్ పై 30 వేలు, డీజిల్ వేరియంట్ పై 20 వేలు ఇలా వేరియంట్ ను బట్టి వివిధ రకాల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. జూన్ 30 వరకే ఈ డిస్కౌంట్ లభించనుంది. త్వరలో టాటా నెక్సాన్ కార్లలో పనోరమిక్ సన్ రూఫ్ ఫీచర్ ప్రవేశపెట్టనున్నామని టాటా మోటార్స్ తెలిపింది. టాటా నెక్సాన్ లో 120 పీఎస్-170 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంది. 1.2 లీటర్ టర్బ పెట్రోల్ ఇంజన్, 115 పీఎస్, 260 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

Also read: EPFO New Rules: పీఎఫ్ అడ్వాన్స్ విత్‌డ్రా ఇకపై సాధ్యం కాదు, రూల్స్ మారిపోయాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News