Tata Sons vs Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించారు. రోడ్డు ప్రమాదంలో ఇవాళ మద్యాహ్నం 3 గంటలకు ప్రాణాలు కోల్పోయారు. అసలు సైరస్ మిస్త్రీ ఎవరు, ఆయనకు టాటా గ్రూప్‌కు ఉన్న వివాదమేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అకాల మరణం చెందారు. అహ్మాదాబాద్ నుంచి మంబై వెళ్తుండగా జరిగిన కారు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. మహారాష్ట్ర పాల్ఘడ్ జిల్లా సూర్య నది వంతెనపై డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇవాళ మద్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అసలు సైరస్ మిస్త్రీ నేపధ్యమేంటి, ఆయనకు టాటా గ్రూపుకు మధ్య ఉన్న వివాదమేంటో తెలుసుకుందాం..
సైరస్ మిస్త్రీ ఎవరు
టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా దిగిపోయిన తరువాత 2012లో కొత్త ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఎన్నికయ్యారు. టాటా సన్స్‌లో అతిపెద్ద షేర్ హోల్డర్ అయిన షాపూర్ జి పాలోంజి గ్రూప్ రిప్రజంటేషన్తో సైరస్ మిస్త్రీ టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ అయ్యారు. టాటా సన్స్ బోర్డ్‌లో సైరస్ మిస్త్రీ తండ్రి పాలోంజి మిస్త్రీ అనంతరం 200లో చేరారు. పాలోంజీ మిస్త్రీ నిర్మాణరంగంలో టైకూన్ గా షాపూర్ జి పాలోంజి గ్రూప్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2016 అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డు సైరస్ మిస్త్రీని ఛైర్మన్ పదవి నుంచి ఉద్వాసన పలికింది.
టాటా గ్రూపుకు, సైరస్ మిస్త్రీకు వివాదమేంటి
డిసెంబర్ నెలలో మిస్త్రీ కుటుంబం నేపధ్యమున్న రెండు కంపెనీలు సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్లు ముంబై కోర్టులో టాటా సన్స్ దుర్వినియోగం, సైరస్ మిస్త్రీ ఉద్వాసనను సవాలు చేశారు.
2017 జనవరి 12న అప్పటి టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ ఛైర్మన్‌గా నియమించింది.
ఫిబ్రవరి 6న టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా కూడా మిస్త్రీని తొలగించారు.
మార్చ్ 6, 2017లో సైరస్ కుటుంబ నేపధ్యమున్న రెండు కంపెనీలు వేసిన పిటీషన్లను పక్కనపెట్టేసింది. ఏప్రిల్ 17వ తేదీన ముంబై ఎన్సీఎల్టీ కూడా ఆ రెండు కంపెనీల పిటీషన్‌ను తిరస్కరించింది. ఏప్రిల్ 27వ తేదీన ఆ రెండు కంపెనీలు ఎన్సీఎల్టీ ఆదేశాల్ని సవాలు చేస్తూ..ఎన్సీఎల్ఏటీకు వెళ్లాయి. సెప్టెంబర్ 21వ తేదీన ఎన్సీఎల్ఏటీ రెండు కంపెనీల పిటీషన్‌ను స్వీకరించింది. నోటీసు ఇష్యూ చేసి కేసును పరిగణించాల్సిందిగా ముంబై బెంచ్‌కు ఆదేశించింది.
అక్టోబర్ 5 వతేదీన సైరస్ కుటుంబ నేపధ్యమున్న ఆ రెండు కంపెనీలు ఢిల్లీలోని ఎన్సీఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్‌కు వెళ్లాయి. కేసును ముంబై నుంచి ఢిల్లీకు బదిలీ చేయాల్సిందిగా కోరాయి. ప్రిన్సిపల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.
అక్టోబర్ 6 వ తేదీన ఎన్సీఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్ పిటీషన్లను కొట్టిపారేయడమే కాకుండా ఆ రెండు కంపెనీలపై 10 లక్షల జరిమానా విధించింది.
2018 జూలై 9వ తేదీన ముంబై ఎన్సీఎల్టీ సైరస్ మిస్త్రీ ఉద్వాసనను ఛాలెంచ్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను కొట్టివేసింది. పిటీషనర్ వాదనలో పస లేదని తెలిపింది.
2018 ఆగస్టు 3వ తేదీన ఎన్సీఎల్టీ పిటీషన్ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీకు వెళ్లాయి. ఆగస్టు 29వ తేదీన పిటీషన్‌ను ఎన్సీఎల్ఏటీ స్వీకరించింది.
2019 మే 23న ఎన్సీఎల్ఏటీ తీర్పును రిజర్వ్ చేసింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా మళ్లీ నియమించింది. అయితే టాటా సన్స్ అప్పీల్ చేసేందుకు 4 వారాల గడువిస్తూ..నియామకాన్ని 4 వారాలు పెండింగులో పెట్టింది.
2020 జనవరి 2వ తేదీన టాటా సన్స్ ఎన్సీఎల్ఏటీ ఆదేశాల్ని సవాలు చేస్తకూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 10వ తేదీన సుప్రీంకోర్టు స్టే మంజూరు చేసింది.
సెప్టెంబర్ 22న షాపూర్ జి పాలోంజీ గ్రూప్‌ను సుప్రీంకోర్టు నిలువరించింది. డిసెంబర్ 8న ఈ వివాదంపై తుది విచారణ సాగింది. డిసెంబర్ 17వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.
చివరిగా మొన్న శుక్రవారం నాడు టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించడాన్ని సుప్రీంకోర్టు సమర్దించింది.
Also read: Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook