కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఇన్వెస్ట్‌మెంట్ పథకాలను ప్రకటించింది. సరైన పథకాల్లో డబ్బులు పెట్టుబడి పెడితే లాభాలతో పాటు ట్యాక్స్ మినహాయింపు పొందుతారు. ట్యాక్స్ మినహాయింపు లభించే ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదిక. ఎందుకంటే ఈ పధకంలో పెట్టుబడి పెడితే ట్యాక్స్ మినహాయింపుతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చు.
పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్
పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది ట్యాక్స్ మినహాయింపు ఇచ్చే అద్భుతమైన పథకంగా ఉంది. ఈ పధకంలో ఇన్‌కంటాక్స్ ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో ఏడాదికి పలు వాయిదాల ద్వారా గరిష్టంగా 1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఒప్పందం లాంటింది. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ మీకు అనారోగ్యం కలిగినప్పుడు మీ వైద్య ఖర్చుల్ని సంబంధిత ఆసుపత్రికి చెల్లిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మీకు మెడికల్ బిల్, ఆసుపత్రిలో చేరిన ఖర్చులు, కన్సల్టేషన్ ఫీజులు, ఆంబులెన్స్ ఖర్చుల్ని కవర్ చేస్తుంది. దీనికోసం నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌ను మీరు మీ భార్య లేదా భర్త, పిల్లలు ఇతర కుటుంబ సభ్యులకు వర్తించేలా చేయించవచ్చు.
నేషనల్ పెన్షన్ స్కీమ్
ఎన్‌పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే 50 వేల రూపాయల వరకూ ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. అంతేకాకుండా..మెచ్యూరిటీ పూర్తయ్యాక సేవ్ చేసిన మొత్తం నుంచి 60 శాతం డ్రా చేసుకోవచ్చు.
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఆకస్మిక మరణ ప్రయోజనం కలుగుతుంది. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ గా ఉంటుంది. మీ కుటుంబసభ్యులపై చెల్లించే ఖర్చుపై ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కష్ట సమయాల్లో పనికొస్తుంటుంది.
Also read: IRCTC New Rules: ఐఆర్‌సీటీసీ కొత్త నియమాలు, మీ ఎక్కౌంట్ ఇలా వెరిఫై చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook