Coins missing in SBI: ఎస్​బీఐలో రూ.11 కోట్ల విలువైన కాయిన్స్ మాయం..

Coins missing in SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐలోత చోరీ జరిగింది. రూ.11 కోట్ల విలువైన నాణెలు చోరీ అయినట్లు తెలిసింది. ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 09:15 PM IST
  • స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీ
  • రూ.11 కోట్ల విలువైన నాణెలు మాయం
  • దొంగలకోసం రంగంలోకి సీబీఐ
Coins missing in SBI: ఎస్​బీఐలో రూ.11 కోట్ల విలువైన కాయిన్స్ మాయం..

Coins missing in SBI: డబ్బులు ఇంట్లో దాచుకుంటే ఎక్కడ దొంగలు పడతారోనని బయపడటం సాధారణంగా చూస్తుంటాం. అందుకే ఈ సమస్యకు ఉన్న అత్యుత్తమ పరిష్కారం డబ్బును బ్యాంకులో దాచుకోవడం. కానీ ఆ బ్యాంకులోనే చోరీ జరిగితే.. అలాటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ ఏమైందంటే..

ఓ ఎస్​బీఐ బ్యాంక్​లో ఈ చోరీ జరగటం గమనార్హం. అయితే ఇక్కడ దొంగలు చోరీ చేసిన మొత్తం రూ.11 కోట్లు కాగా.. ఆ మొత్తం కాయిన్ల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ సంఘ‌ట‌న  రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చోటు చేసుకుంది.  ఈ చోరీని చేదించేందుకు ఏకంగా సీబీఐ రంగంలోకి దిగింది.

నోట్లు అయితే వాటిపై ఉండే సీరియల్ నంబర్స్​ ద్వారా సులభంగా గుర్తించొచ్చు. కానీ నాణెలు కావడంతో వాటిని గుర్తించి పట్టుకోవడం ఇప్పుడు అత్యంత క్లిష్టమైన అంశంగా మారింది.

పూర్తి వివరాలు ఇలా..

రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో తాజాగా..  ఏకంగా రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమయ్యాయి. ఉన్న‌తాధికారులు తాజాగా లెక్క‌లు తీయ‌గా...  ఈ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీంతో షాక్​కు గురైన అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఎఫ్​ఐఆర్​ కూడా నమోదు చేయించారు. ఇక ఇదే విషయమై రాజస్థాన్ హై కోర్టును కూడా ఆశ్రయించారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఎస్​బీఐ అభ్యర్థనను స్వీకరించిన న్యాయస్థానం.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

కోర్టు అదేశాల మేరకు పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్​ను తీసుకుని..  సోమ‌వారం రోజునే ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు సీబీఐ అధికారులు. ప్ర‌స్తుతం అనుమానితులుగా ఉన్న వారిని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ప్రథమిక దర్యాప్తులోనే పలు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. రూ.11 కోట్ల విలువైన నాణెలను.. ఆ దొంగలు రూ.13 కోట్లకు విక్రయించాలని ప్లాన్ వేసినట్లు తెలిసింది. అయితే వీలైనంత త్వరగా ఆ దొంగలను పట్టుకోవాలని సీబీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Also read: Jio Airtel: మీరు జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లా.. రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే...

Also read: Redmi 10A Launch: రెడ్‌మి నుంచి మరో కొత్త ఫోన్, రేపే ఇండియాలో లాంచ్, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News