Gold Rate: దిగొస్తున్న బంగారం ధరలు, వెండి భారీ పతనం

వరుసగా రెండోరోజు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు  (Gold Rate Today) దిగొచ్చాయి. తాజాగా వెండి ధర రూ.600 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,000కి పతనమైంది. 

Last Updated : Oct 15, 2020, 07:30 AM IST
Gold Rate: దిగొస్తున్న బంగారం ధరలు, వెండి భారీ పతనం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా రెండోరోజు స్వల్పంగా దిగొచ్చాయి. మరోవైపు మార్కెట్‌లో వెండి ధరలు సైతం పతనమయ్యాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.300 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,790 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.290 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,360కి పడిపోయింది.

ఢిల్లీలో మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా రెండోరోజూ తగ్గాయి. తాజాగా బంగారం ధర రూ.350 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,730కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గింది. 10 గ్రాముల ధర రూ.49,250కి క్షీణించింది.

 

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగిన వెండి ధరలు (Silver Rate in India) తాజాగా దిగొస్తున్నాయి. తాజాగా వెండి ధర రూ.600 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,000కి పతనమైంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News