Best 5 Laptops: 50 వేలకంటే తక్కువ ధర కలిగిన టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే

Best 5 Laptops: ల్యాప్‌టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి అవకాశం. బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్స్ మీ బడ్జెట్‌కు అనుకూలంగానే ఉండనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం...

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 23, 2023, 12:57 PM IST
Best 5 Laptops: 50 వేలకంటే తక్కువ ధర కలిగిన టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే

Best 5 Laptops: ల్యాప్‌ట్యాప్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది. వర్క్ ఫ్రం హోం కారణంగా ల్యాప్‌టాప్ వినియోగం కూడా అధికమైంది. విద్యార్ధులకు కూడా ల్యాప్‌టాప్ తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో తక్కువ బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. 

ల్యాప్‌టాప్ కొనే ఆలోచన ఉంటే ఇక్కడ మీ కోసం కొన్ని ల్యాప్‌టాప్ ఆప్షన్స్ ఇస్తున్నాం. అందుబాటు ధరల్లో ఉన్న బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్ ఇవి. 50 వేల కంటే తక్కువ ధర ఉన్న టాప్ 5 ల్యాప్‌టాప్స్ , వాటి ఫీచర్ల గురించి తెలుసుకుందాం. హెచ్‌పి, లెనోవో, ఏసస్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది బడ్జెట్ అనుకూలమైన ల్యాప్‌టాప్స్ లాంచ్ చేశాయి. అయితే షియోమి, రియల్‌మి, ఇన్‌ఫినిక్స్ కంపెనీలు కొత్తగా ల్యాప్‌టాప్‌లు ప్రవేశపెట్టలేదు. ఈ కంపెనీలు తమ కొత్త మోడల్స్ లాంచ్ చేసేందుకు మరింత సమయం పట్టవచ్చు. అయితే ఇక్కడ మేం ప్రస్తావించే 50 వేలకు దిగువన ఉన్న ల్యాప్‌టాప్‌లు కేవలం ప్రొడక్టివిటీ కోసం ఉపయోగపడతాయి. అంటే గేమింగ్, గ్రాఫిక్స్ పనులకు ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. 

50 వేలకంటే తక్కువ ధర కలిగిన టాప్ 5 ల్యాప్‌టాప్‌లు

1. HP 15s

నమ్మకమైన, బ్రాండెడ్ ల్యాప్‌టాప్ కావాలంటే HP 15s with AMD Ryzen 5-5500U ప్రోసెర్ మంచి ఆప్షన్ కావచ్చు. ఇది 13వ జనరేషన్ కోర్ ఐ3 మోడల్. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.6 కిలోలతో లైట్ అండ్ స్లీక్‌గా ఉంటుంది. 15 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డి, ఎలెక్సా సపోర్ట్, ఎస్డి కార్డ్ స్లాట్ ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ ధర 47,999 రూపాయలు.

2. Lenovo IdeaPad Slim 3 Gen 6

విద్యార్ధులకు, ఉద్యోగులకు ఇది మంచి ఆప్షన్. లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జనరేషన్ 6 లో ఏఎండీ రైజెన్ 5-5500యు ప్రోసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, ఏఎండి రేడియోన్ గ్రాఫిక్స్ ఉంటుంది. హెచ్‌పి 15 కంటే లాంగర్ లైఫ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. ఈ ల్యాప్‌టాప్ ధర 48,990 రూపాయలు

3. Asus Vivobook Flip 14

ట్రెడిషనల్ ల్యాప్‌టాప్ కావాలంటే ఏసస్ వివోబుక్ ఫ్లిప్ 14 మంచి ఆప్షన్ కాగలదు. ఇది ల్యాప్‌టాప్ టు ట్యాబ్లెట్ అనుభవాన్నిస్తుంది. సినిమాలు చూసేవారికి, ఆన్‌లైన్‌లో పుస్తకాలు చదివేవారికి ఇది మంచి ఆప్షన్. 11వ జనరేషన్ కోర్ ఐ5 ప్రోసెసర్ ఉంటుంది. 8 జీబి ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డి స్టోరేజ్ అదనపు ప్రత్యేకతలు. 14 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి టచ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర 44,990 రూపాయలు

4. M:i NoteBook Pro​

ఎంఐ నోట్‌బుక్ ప్రోలో స్లీక్ మెటల్ బాడీతో పాటు 14 ఇంచెస్ హెచ్‌డి డిస్‌ప్లే ఉంటుంది. 11వ జనరేషన్ కోర్ ఐ5 ప్రోసెసర్ కలిగి ఉండే ల్యాప్‌టాప్ ఇది. ఈ ల్యాప్‌టాప్ 1.4 కిలోల బరువుంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర 49,990 రూపాయలు. 

5. Asus VivoBook 16X

ఇక మరో ఆప్షన్ ఏసస్ వివోబుక్ 16ఎక్స్. ప్రొఫెషనల్స్‌కు ఇది చాలా మంచి ల్యాప్‌టాప్. 16 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఏఎండీ రైజెన్ 5-5600 హెచ్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. విండోస్ 11 ఆధారంగా పనిచేస్తుంది. బ్యాటరీ లైఫ్ ఏకంగా 8 గంటలుంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర 49,990 రూపాయలు.

Also read: Bank Holidays June 2023: జూన్ లో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసిన ఆర్బీఐ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x