Banned Medicines in India: 14 డ్రగ్ కాంబినేషన్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. ఎందుకంటే..?

Banned Medicines in India: దేశంలో ఎన్నో రకాల మందులు చలామణీలో ఉన్నాయి. ఇందులో నిషేధిత మందులు కూడా యధేఛ్చగా వాడుకలో ఉంటున్నాయి. విదేశాల్లో నిషేధించిన మందులు ఇండియాలో మాత్రం ప్రిస్క్బైబ్ అవుతున్నాయి. అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 6, 2023, 04:51 PM IST
Banned Medicines in India: 14 డ్రగ్ కాంబినేషన్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. ఎందుకంటే..?

Banned Medicines in India 2023: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా కొన్ని రకాల మందుల్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధిత మందులన్నీ కాంబినేషన్ డ్రగ్స్ కావడం విశేషం. వీటివల్ల మేలు జరగకపోగా ప్రజారోగ్యానికి హాని కలగనుంది. కేంద్రం తాజాగా నిషేధించిన మందుల జాబితా ఇదీ..

థెరపెటిక్ జస్టిఫికేషన్ అంటే చికిత్సాపరమైన ప్రయోజనం లేకపోవడమే కాకుండా ప్రజా రోగ్యానికి హాని కల్గిస్తుందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా 14 రకాల కాంబినేషన్ డ్రగ్స్ నిషేధించింది. దేశంలో విస్తృతంగా ఉపయోగించే పారాసిటమల్-నిమ్సులిడ్ కాంబినేషన్ ఉండటం విశేషం. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది. ఈ కాంబినేషన్ డ్రగ్స్ కారణంగా ప్రజారోగ్యానికి హాని కలుగుతోందని వెల్లడించింది. 

ప్రభుత్వం నిషేధించిన డ్రగ్ కాంబినేషన్లు ఇవే

ఇందులో ప్రత్యేకంగా గమనించాల్సిన అంశమేంటంటే కేంద్రం నిషేధించిన 14 రకాల ఎఫ్‌డీసీలు 344 కాంబినేషన్లలో భాగంగా ఉన్నాయి. ఇవన్నీ సర్వ సాధారణంగా నిత్యం ఉపయోగించేవే. ముఖ్యంగా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, దగ్గు, జలుబుకు ఉపయోగించే మందులే. ఇందులో ముఖ్యంగా నిమ్సులిడ్-పారాసిటమాల్ డిస్పర్సిబుల్, క్లోర్‌ఫెనిరమిన్ మ్యాలేట్-కోడైన్ సిరప్, ఫాల్కోడిన్-ప్రోమెథజైన్, అమోక్సిసిల్లిన్-బ్రోమ్‌హెక్సిన్, బ్రోమ్‌హెక్సిన్-డెక్సోమెథోర్ఫన్-అమ్మోనియం క్లోరైడ్-మెంథాన్, పారాసిటమాల్-బ్రోమ్‌హెక్సిన్-ఫినైల్‌ఫ్రైన్-క్లోర్‌ఫెనిరమిన్ -గువాఫెనిసిన్ మరియు సాల్బుటమోల్-బ్రోమ్‌హెక్సిన్ కాంబినేషన్లు ఉన్నాయి.

14 రకాల కాంబినేషన్ డ్రగ్స్ ప్రభుత్వం ఎందుకు నిషేధించింది

కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ మందుల్ని నిషేధించింది. నిపుణుల కమిటీ ప్రకారం ఈ మందులకు చికిత్సా పరమైన ప్రయోజనాలేవీ లేవు. అదే సమయంలో మనుషుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లనుంది. అందుకే ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిని నియంత్రించడం, అమ్మకాలు, పంపిణీని నిలిపివేయడం అత్యవసరంగా మారింది. అందుకే 1940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం సెక్షన్ 26ఏ ప్రకారం ఈ డ్రగ్స్‌ను నిషేధించారు.

నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ తరహా మందుల ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాలను నిలిపివేయడం మంచిదనే నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డీసీ డ్రగ్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మందుల కాంబినేషన్ కలిగినవి. 2016లోనే కేంద్ర ప్రభుత్వం..సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనలతో 344 కాంబినేషన్ డ్రగ్స్‌ను నిషధిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తరువాత ఈ ఉత్తర్వులను కోర్టులో సవాలు చేశారు. 

Also Read: Cheapest SUV Car: దేశంలోనే అత్యంత చౌకైన ఎస్‌యూవీ ఇదే, 62 వేలు డిస్కౌంట్ కూడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News