Online Frauds Alert: డిజిటల్ ప్రపంచం పెరిగేకొద్దీ హ్యాకర్ల మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎన్నో రకాలుగా మోసం చేస్తున్న ఘటనలు ఎదురౌతున్నాయి. ఓటీపీ షేర్ చేయుకుండానే ఎక్కౌంట్లు ఖాళీ చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలంటూ హోంమంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది.
సైబర్ మోసాలకు పాల్పడే హ్యాకర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలు అవలంభిస్తున్నారు. అందుకే మోసపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ పరిస్థితి ఎంతవరకూ చేరిందంటే ఓటీపీ షేర్ చేయకుండానే బ్యాంకు ఎక్కౌంట్లు ఖాళీ అయిపోతున్నాయి. అందుకే హోంమంత్రిత్వ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించింది. సైబర్ నేరాలు చేసేవాళ్లు ప్రజలు ఎక్కౌంట్లను అత్యంత చాకచక్యంగా దోచుకుంటున్నారని తెలిపింది. ఈసారి పూర్తిగా విభిన్నమైన స్కాంను హోం శాఖ బయటపెట్టింది.
ఈ కొత్త తరహా మోసంలో బ్యాంక్ ఎక్కౌంట్ పూర్తిగా ఖాళీ అయిపోతోంది. చాలా కేసుల్లో ఓటిపీ ప్రమేయం ఉండటం లేదు. అంటే ప్రజలు మోసపోయేందుకు మరింత సులభమైన మార్గమిది. స్కామర్లు ప్రజల్ని హ్యాకింక్ నుంచి రక్షిస్తున్నామని చెప్పుకుని ఆ వలలో మోసం చేస్తుంటారు.
ఎలా మోసం చేస్తారంటే..
స్కామర్లు ముందుగా సామాన్య ప్రజల్ని ఎంచుకుని ఫోన్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్ హ్యాక్ అయిందని చెబుతారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటారు. కొన్నిసార్లు *401#9818×××××6 నెంబర్‌కు డయల్ చేయమంటారు. లేదా వాటి నుంచి ఫోన్ చేస్తారు. ఇలా జరిగితే వెంటనే అలర్ట్ కావాలి. చాలామంది ఇక్కడే మోసపోతుంటారు. అలా డయల్ చేయగానే మీ మెస్సేజ్‌లు, కాల్స్ మీరు డయల్ చేసిన నెంబర్‌కు వెళ్లిపోతుంటాయి. అంతే మీ ఎక్కౌంట్లు ఖాళీ అయిపోతుంటాయి.
Also read: LPG Gas Subsidy: మీకు గ్యాస్ సబ్సిడీ వస్తుందో లేదో తెలియడం లేదా, ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook