Digital Rupee: క్రిప్టోకరెన్సీకు, డిజిటల్ రూపీకు వ్యత్యాసమిదే, ఇవే ఆ ప్రయోజనాలు

Digital Rupee: కేంద్ర బడ్జెట్‌లో డిజిటల్ కరెన్సీపై ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం మోపిన కేంద్రం..డిజిటల్ రూపీ ప్రవేశపెడుతోంది. అసలు డిజిటల్ రూపీకు..క్రిప్టోకరెన్సీకు ఉన్న వ్యత్యాసమేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 1, 2022, 02:27 PM IST
Digital Rupee: క్రిప్టోకరెన్సీకు, డిజిటల్ రూపీకు వ్యత్యాసమిదే, ఇవే ఆ ప్రయోజనాలు

Digital Rupee: కేంద్ర బడ్జెట్‌లో డిజిటల్ కరెన్సీపై ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం మోపిన కేంద్రం..డిజిటల్ రూపీ ప్రవేశపెడుతోంది. అసలు డిజిటల్ రూపీకు..క్రిప్టోకరెన్సీకు ఉన్న వ్యత్యాసమేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

కేంద్ర బడ్జెట్ (Budget 2022) ముగిసింది. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కీలకమైన నిర్ణయాల్ని ప్రకటించారు. ముఖ్యంగా ఎప్పట్నించో ఊహాగానాలకు పరిమితమైన క్రిప్టోకరెన్సీ విషయంలో కీలక ప్రకటన చేస్తూ..ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. క్రిప్టోకరెన్సీ ఆధారిత ఆదాయాలపై 30 శాతం వరకూ ట్యాక్స్ విధిస్తూ ఝలక్ ఇచ్చింది. అదే సమయంలో కొత్తగా ఇండియా డిజిటల్ రూపీ ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బ్లాక్ ఛైన్ టెక్నాలజీ ద్వారా అభివృద్ది చేసిన డిజిటల్ రూపీ..దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్టు ..రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా జారీ చేస్తుందని చెప్పారు. దేశంలో క్రిప్టోకరెన్సీ(Cryptocurrency) వినియోగం ఎక్కువైన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నేపధ్యంలో క్రిప్టోకరెన్సీకు , ఇండియా ప్రవేశపెడుతున్న డిజిటల్ రూపీకు తేడా ఏంటనేది తెలుసుకుందాం.

బిట్ కాయిన్, ఎథిరియమ్ వంటి క్రిప్టోకరెన్సీలకు ఏ విధమైన స్థిరత్వం ఉండదు. అంటే స్థిరమైన విలువంటూ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ కారణాలతో క్రిప్టోకరెన్సీ విలువ ఒక్కసారిగా పెరగడం గానీ, తగ్గడం గానీ జరుగుతుంది. అంతేకాకుండా ఈ కరెన్సీపై ఏ విధమైన అధికారిక నియంత్రణ ఉండదు. ఫలితంగా దుర్వినియోగమయ్యే అవకాశాలు, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడే పరిస్థితి ఉంటుంది. 

అదే డిజిటల్ రూపీ (Digital Rupee) అయితే..స్థిరమైన విలువ అంటే రూపాయికి సమానమైన విలువ కలిగి ఉంటుంది. అధికారికంగా ఆర్బీఐ నియంత్రణలో ఉంటుంది. అన్ని రకాల లావాదేవీలకు డిజిటల్ రూపీ ఉపయోగించుకునే అవకాశముంటుంది. డిజిటల్ రూపీని..సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే సీబీడీసీ అని కూడా పిలవవచ్చు. ఇవి చట్టపరమైన టెండర్లుగా ఉంటాయి. డిజిటల్ రూపీ తరహా చట్టపరమైన లీగలైజ్డ్ డిజిటల్ కరెన్సీలు పలు దేశాల్లో ఇప్పటికే ఉన్నాయి. డిజిటల్ డాలర్, ఇ యువాన్, డిజిటల్ యూరోలు ఈ కోవలోకే వస్తాయి. డిజిటల్ రూపీ అనేది ప్రింటింగ్ ఖర్చుల్ని తగ్గిస్తుంది. టైమ్ జోన్ సమస్యను నివారిస్తుంది. సెటిల్మెంట్ రిస్క్‌లు తగ్గుతాయి. ఇండియా ప్రవేశపెడుతున్న డిజిటల్ కరెన్సీతో కచ్చితంగా దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆర్ధికరంగ నిపుణులు చెబుతున్నారు. షేర్ మార్కెట్‌కు కూడా ఈ ప్రకటన ఊతంలా పనిచేయనుంది. 

Also read: Budget 2022 Updates: క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం, త్వరలో సొంతంగా డిజిటల్ రూపీ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News