X logo Removed: ఎలాన్ మస్క్‌కు షాక్.. ఎక్స్ లోగో తొలగింపు..!

X logo Removed From Twitter Headquarters in San Francisco: శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయంపై ఏర్పాటు చేసిన X లోగోను తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమకు లోగోలోని లైట్ కాంతి వల్ల ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 1, 2023, 04:35 PM IST
X logo Removed: ఎలాన్ మస్క్‌కు షాక్.. ఎక్స్ లోగో తొలగింపు..!

X logo Removed From Twitter Headquarters in San Francisco: ట్విట్టర్ లోగోలో పిట్ట స్థానంలో ఎక్స్‌ (X)ను ఎలాన్ మస్క్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయంపై X లోగోను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను ఎలాన్ మాస్క్ షేర్ చేశారు. తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం ట్విట్టర్‌కు షాకిచ్చింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో X లోగోను తొలగించింది. లోగో డిస్‌ప్లేలో అమర్చిన భారీ లైట్ల వెలుతురు తమ ఇళ్లపై పడుతుందని.. రాత్రుళ్లు తమకు నిద్రకు భంగం కలుగుతోందని 24 మంది స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో లోగోను తొలగించినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో సిబ్బంది వెల్లడించారు. 

"శాన్ ఫ్రాన్సిస్కో బిల్డింగ్ ఇన్‌స్పెక్షన్స్ విభాగానికి 24 ఫిర్యాదులు అందాయి. అనుమతి లేకుండా లోగో పెట్టారని.. లోగోలోని లైట్ వల్ల ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేశారు. మెరుస్తున్న లైట్ల కారణంగా నిద్రకు భంగం కలుగుతోందని చెప్పారు. ఆ లోగోను అనుమతి లేకుండా ఏర్పాటు చేశాని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా సిబ్బంది లోగో ఏర్పాటును సమీక్షించింది. రూల్స్‌కు విరుద్ధంగా లోగోను ఏర్పాటు చేసినట్లు గుర్తించింది. దీంతో వెంటనే X లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం.." అని శాన్ ఫ్రాన్సిస్కో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్షన్ ప్రతినిధి పాట్రిక్ హన్నన్ వెల్లడించారు.

ఎక్స్‌ లోగో ఏర్పాటుపై విచారణకు కూడా ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఒక సంస్థ లోగో గుర్తును మార్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన డిజైన్‌, భద్రత కారణాల దృష్ట్యా ముందుగానే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్విట్టర్ సిబ్బంది ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. భవనంపై కాంతివంతమైన లోగోను ఏర్పాటు చేయడంతో తాము పడుతున్న ఇబ్బందులపై స్థానిక నివాసితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో లోగోను తొలగించారు.  
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను గతేడాది అక్టోబర్‌లో సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ పెను మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా భారీగా ఉద్యోగాలను తొలగించిన మస్క్.. ఆ తరువాత బ్లూ టిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ విధానం తీసుకువచ్చారు. టెక్ట్స్ విషయంలో మార్పులు చేయగా.. రోజుకు పోస్టులను చూసేందుకు కూడా లిమిట్ విధించారు. ఇక ట్విట్టర్ లోగోలో పిట్టను X గుర్తుతో రిప్లేస్ చేశారు. 

Also Read: Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర  

Also Read: Amrit Bharat Stations: రాష్ట్రంలో అమృత్ భారత్ స్కీమ్‌ కింద ఎంపికైన స్టేషన్లు ఇవే.. ఈ నెల 6న ప్రధాని శంకుస్థాపన   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x