YouTube Music: ఇకపై యూట్యూబ్ మ్యూజిక్‌ ఫ్రీ! ముందుగా కెనడాలో ప్రారంభం!

YouTube Music: సంగీత ప్రియులకు గూగుల్ శుభవార్త చెప్పింది. యూట్యూబ్‌ మ్యూజిక్‌ ఫ్రీగా అందించాలని గూగుల్ నిర్ణయించింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2021, 04:40 PM IST
YouTube Music: ఇకపై యూట్యూబ్ మ్యూజిక్‌ ఫ్రీ! ముందుగా కెనడాలో ప్రారంభం!

YouTube Music: మ్యూజిక్ లవర్స్ కు గూగుల్(Googles) గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకాలం ఫెయిడ్ సర్వీసుగా ఉన్న యూట్యూబ్ మ్యూజిక్(YouTube Music)ను ఇకపై ఉచితంగా అందించాలని గూగుల్ నిర్ణయించింది. 

నచ్చిన పాటలు వినడం కోసం ఎక్కువ మంది ఉపయోగించేది యూట్యూబ్(YouTube). అయితే ఈ యాప్‌ ప్రధానంగా వీడియో ఆధారితమైనది కావడంతో కచ్చితంగా వీడియోను చూడాల్సి వస్తుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ త్వరగా డ్రైయిన్‌ అయ్యేది. ఈ సమస్యను అధిగమించేందుకు గూగుల్‌ సంస్థ యూట్యూబ్‌ మ్యూజిన్‌కి అందుబాటులోకి తెచ్చింది. 

Also Read: WhatsApp, facebook and instagram: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సర్వర్స్ డౌన్

‍యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్లో స్క్రీన్‌ను ఆఫ్‌ చేసి పాటలు వినొచ్చు ఇతర యాప్‌లు కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇది పూర్తిగా పెయిడ్‌ సర్వీస్‌(Paid Service)గా అందుబాటులో ఉంది. దీంతో చాలా మందికి ఆ యాప్‌ చేరువ కాలేకపోయింది. అయితే తాజాగా ఈ సర్వీసును ఫ్రీగా అందించాలని గూగుల్‌ నిర్ణయించింది. ఎటువంటి రుసుము చెల్లించకుండానే సంగీతాన్ని(Music) ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది.

ముందు అక్కడే ప్రారంభం
యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ని నవంబరు 3 నుంచి ఫ్రీ సర్వీసుగా అందిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది. మొదట కెనడా(Canada)లో ఈ సర్వీసును ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని.. ఆ తర్వాత దశల వారీగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తామని ప్రకటించింది. అయితే ఫ్రీ సర్వీసులో యాడ్స​ వస్తాయని తెలిపింది. యాడ్స​ వద్దనుకున్నవారు పెయిడ్‌ సర్వీసును ఎంచుకొచ్చని సూచించింది. 

ఇండియా(India)లో కొన్ని హై ఎండ్‌మొబైల్‌ ఫోన్లలో బండిల్‌ ఆఫర్‌గా యూట్యూబ్‌ మ్యూజిక్‌ అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో ఈ సర్వీసు ఉచితం(Free)గా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతాన్ని ఎంజాయ్‌ చేయోచ్చు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News