Aaftab Romance: ఫ్రిజ్‌లో శ్రద్ధ శవం.. ఆ అమ్మాయిలను ఇంటికి రప్పించుకుని శృంగారం?

Aaftab Romance with another women: తాను చంపిన శ్రద్ధ శరీరంలోని కొన్ని భాగాలు తన ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఉండగానే అఫ్తాబ్ డేటింగ్ యాప్ ద్వారా పలువురు యువతులను పటాయించి వారితో సెక్స్ లో పాల్గొన్నట్టు తేలింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 15, 2022, 02:28 PM IST
Aaftab Romance: ఫ్రిజ్‌లో  శ్రద్ధ శవం.. ఆ అమ్మాయిలను ఇంటికి రప్పించుకుని శృంగారం?

Aaftab Romance with another women While Shraddha’s Body Remained in Fridge: ఢిల్లీలో తనతో లివిన్ రిలేషన్లో ఉన్న యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేసిన నిందితుడు అఫ్తాబ్‌ కేసుకుకు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అఫ్తాబ్ ఎంత పెద్ద రాక్షసుడో ఈ ఒక్క విషయంతో మీకు అర్థమై పోతుంది. శ్రద్ధాను చంపి ఒక్కొక్క శరీర భాగాన్ని ఎవరికీ చిక్కకుండా డిస్పోజ్ చేస్తూ వస్తున్న అతను ఆమె మృతదేహానికి సంబంధించిన భాగాలను ఫ్రిజ్లో పెట్టాడు.

అలా పెట్టాక అతను అదే గదిలో మరొక అమ్మాయితో సెక్స్ లో కూడా పాల్గొన్నాడు అనే విషయం వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల శ్రద్ధా హత్య కేసులో విచారణలో, శ్రద్ధ మృతదేహం ఫ్రీజ్‌లో ఉన్నప్పుడు కూడా నిందితుడు అఫ్తాబ్ అదే గదిలో పలువురు అమ్మాయిలతో సరసాలాడుతున్నాడని పోలీసులకు తెలిసింది. శ్రద్ధాను కిరాతకంగా చంపిన తర్వాత, నిందితుడు అఫ్తాబ్ ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి కొన్ని వారాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాడు, తరువాత ఆ ముక్కలను అడవిలో వివిధ ప్రదేశాలలో విసిరేశాడు.

అందుతున్న సమాచారం వార్తల ప్రకారం, 28 ఏళ్ల అఫ్తాబ్ పూనావాలా శ్రద్దాను చంపిన తరువాత కూడా మరొక అమ్మాయితో క్లోజ్ గా ఉన్నాడని, పోలీసు వర్గాలు తెలిపాయి. శ్రద్ధతో పరిచయం ఏర్పడిన అదే యాప్‌లో అఫ్తాబ్ మరో అమ్మాయి (సైకాలజిస్ట్)తో డేటింగ్ కు దిగాడని అన్నారు. ఈ ఏడాది మేలో శ్రద్ధను హత్య చేసిన తర్వాత డేటింగ్ యాప్ ద్వారా ఇతర మహిళలను కలుస్తూనే ఉన్నానని అఫ్తాబ్ అంగీకరించాడు.

ఇక ఆ మహిళలను దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్‌పూర్ పహాడీలోని తన ఇంటికి తీసుకువచ్చాడని, అక్కడే అతను వారితో శృంగారం చేశాని గుర్తించారు. ఆ సమయంలో, అతను 35 ముక్కలుగా నరికిన శ్రద్ధా వికాస్ వాకర్ మృతదేహం ఆ రిఫ్రిజిరేటర్‌లో ఉందని గుర్తించారు. అఫ్తాబ్ ఇంటికి తరచుగా వచ్చే సదరు మహిళలు అతని నివాసంలో వెలిగించిన అనేక అగరుబత్తీలు , రూమ్ ఫ్రెషనర్లను, అలాగే క్లోరిన్ తో కూడిన దుర్వాసనను గమనించినప్పటికీ, వారిని మేనేజ్ చేయడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.
Also Read: Adipurush Hindi Teaser : కొత్త రికార్డ్.. బాలీవుడ్‌ వెన్నులో వణుకు.. ప్రభాస్ క్రేజ్ ఇదే

Also Read: Siri-Shrihan : శ్రీహాన్ లవర్‌ను ఎత్తుకున్న మానస్.. బిగ్ బాస్ బ్యూటీ సిరి పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News