Bapatla Road Accident : బాపట్లలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

Bapatla Road Accident బాపట్లలో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి పూట కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టుగా స్థానిక పోలీసులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 10:15 AM IST
  • బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
  • అక్కడికక్కడే మృతి చెందిన కుటుంబ సభ్యులు
  • కారు అదుపు తప్పడంతో ప్రమాదం
Bapatla Road Accident : బాపట్లలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

Five Members Dies in Bapatla Road Accident బాపట్లలో ఘోర రోడ్డ ప్రమాదం సంభవించింది. పదహారో నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

మరణించిన వారిలో నలుగురు అద్దంకి ఎస్సై సమందర్ వళ్లీకి చెందినవారే. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై సమందర్ వెక్కి వెక్కి ఏడ్చారని సమాచారం. మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సై భార్య వహీదా, కుమార్తే అయేషా, ఇతర బంధువులు జయశ్రీ, దివ్యతేజ, బ్రహ్మచారి. ఒంగోలు నుంచి హైద్రాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మేదరమెట్ల వద్ద కారు టైర్ పంక్చర్ అవ్వడంతో డివైండర్‌ను ఢీకొట్టడం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారులో చిక్కుకున్న మృత దేహాలను బయటకు తీశారు.

Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం

Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News