Penumuru Minor Girl Death Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృస్టించిన పెనుమూరు మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసుపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఫోరెన్సిక్ నివేదికతో కేసు దర్యాప్తు వేగం పుంజుకుంద్న రిశాంత్ రెడ్డి.. కేవలం ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మాత్రమే కాకుండా మరికొన్ని మెడికల్ కాలేజీల అభిప్రాయాలను కూడా రాత పూర్వకంగా తీసుకున్నాము అని అన్నారు. ఈ రెండు నివేదికలు కూడా కేసు దర్యాప్తులో కీలకంగా మారేలా ఒకదానితొ మరొకటి దాదాపు పోలి ఉన్నాయి అని తెలిపారు.
నివేదికల ఆధారంగా మైనర్ బాలికది ఆత్మహత్యగా అనుమానిస్తున్నాం. ఈ కేసులో అమ్మాయి కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా నలుగురు యువకులను అనుమానితులుగా గుర్తించాం. కానీ తమ వద్ద ఉన్న ఆధారాల ఆధారంగా అన్ని విధాలా విచారణ జరిపిన తరువాత ప్రస్తుతానికి ఆ నలుగురికి ఈ అఫెన్స్‌కు ఏమాత్రం సంబంధం లేదని తేలింది. కానీ ఈ కేసులో వివిధ వర్గాలు తమకు తోచిన విధంగా రూమర్లు క్రియేట్ చేస్తూ వచ్చారు అని పేర్కొన్నారు.
ఆ అమ్మాయి 17వ తేదిన సాయంత్రం తన తల్లితో చిన్నపాటి గొడవపడీ ఇంటినుండి వెళ్ళి పోయింది. ఏ అంశం పై గొడవ పడ్డారు, ఆ అమ్మాయిని ఆత్మహత్యకు ఏవరైనా ప్రేరేపించారా అనే కోణాల్లో విచారణ సాగిస్తున్నాం. అదేవిధంగా బాలిక మృతదేహం మూడు రోజుల పాటు బావిలో ఉండటం వల్ల జుట్టు మొత్తం చర్మంతో సహా ఊడినట్లు, ఆ జుట్టు కూడా మొత్తం బావిలోనే ఉన్నట్లు గతంలోనే పోలిసులు తేల్చారు. మృతదేహం 3 రోజులపాటు బావిలో ఉండటం వల్ల బాడీలో గ్యాస్ ఏర్పడి కళ్ళు బయటకు వచ్చినట్లు నివేదికలో వెల్లడైంది అని అన్నారు. ఆమె లో దుస్తులు లేవని పుకార్లు సృష్టించడం సరికాదు. ఆమె ఇన్నర్ వేర్స్ ఉన్నాయి అని ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : Minor Sisters Killed: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అక్క.. చెల్లెళ్లు చూశారని దారుణం..!
మైనర్ బాలిక అత్యాచారానికి గురైనట్లు ఎలాంటి ఆధారాలు లేవు. సెమన్ శాంపిల్స్ కూడా లభించలేదు. ఎలాంటి ఇన్నర్ , ఔటర్ గాయాలు లేవు అని ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టంచేశారు. కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా ఈ కేసు విచారణలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు అని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మైనర్ బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి, ఆమె ఆత్మహత్య వెనుక ఎవరిదైనా ప్రోద్బలం ఉందా అనే కోణంలో విచారణ జరిపిస్తున్నామని అన్నారు. మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపేశారని తొలుత వచ్చిన ఆరోపణలు, కథనాలు ఏపీలో ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఇచ్చిన వివరణపై ఎలాంటి రియాక్షన్ రానుందో వేచిచూడాల్సిందే మరి.
ఇది కూడా చదవండి : Bike Theft Cases: చోరీకి గురైన మీ బైక్స్ ఏమవుతున్నాయో తెలిస్తే షాక్ అవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి